కథ:
కృష్ణ దేవ్-KD (అడివి శేష్) సంజన అనే అమ్మాయి వికృతమైన మృతదేహాన్ని కనుగొంటాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా.. వివిధ రకాలుగా అమ్మాయిల శరీర భాగాలు లభ్యమవుతాయి. అప్పటి వరకు ఒక అమ్మాయి మాత్రమే హత్య చేయబడింది అని అనుకున్న హీరోకు ఆ బాడీ పార్ట్స్ ఒక్కరివి కాదని చాలామంది అమ్మయిల మర్డర్ జరిగినట్లు తెలుస్తోంది. ఇక హంతకుడు ఎవరు? అసలు KDకి హంతకుడు ఎలాంటి ఛాలెంజ్ లను విసురుతాడు? చివరకు హంతకుడు ఎలా దొరుకుతాడు అనేది హిట్ 2 ప్రధాన కథ.
విశ్లేషణ:
ముందుగా హీరోగా అడివి శేష్ KD పాత్ర గురించి మాట్లాడుకుంటే .. ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా అతను కనిపించిన విధానం కథకు పర్ఫెక్ట్ గా సెట్టయ్యింది. కథలో తనకున్న స్పెస్ లో అడివి శేష్ చక్కగా నటించాడు. ఎక్కడ కూడా కథను డామినేట్ చేసే హీరోయిజమ్ చూపించలేదు. ఆ విషయంలో డైరెక్టర్ శైలేష్ ను మెచ్చుకోవాల్సిందే. ఇక హీరోయిన్ మీనాక్షి కొన్ని సన్నివేశాల్లో రొటీన్ హీరోయిన్ గానే అనిపిస్తుంది. ఆమెకు సంబంధించిన కొన్ని అనవసర సన్నివేశాలు బోరింగ్ గా అనిపించవచ్చు.
డైరెక్టర్ శైలేష్ కొలను HIT 2 కథను హోమిసైడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్ గా వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో కొనసాగించాడు. ఇక దర్శకుడు కథను సాగదీయకుండా సమయాన్ని వృథా చేయకుండా నేరుగా కోర్ ఇన్వెస్టిగేషన్ డ్రామాలోకి వెళ్లాడు. ఒక భయంకరమైన హత్య దాన్ని ఎలివేట్ చేసిన విధానం కథపై మరింత ఆసక్తిని కలిగిస్తుంది. ఇక ఎప్పటిలనే ఇలాంటి కథలో ఒకరి తరువాత మరొక అనుమానితులను హైలెట్ చేస్తూ కథ ముందుకు సాగుతుంది. అది కాస్త రొటీన్ గా అనిపించవచ్చు.
దాదాపు హిట్ ఫస్ట్ కేసు ఫార్ములాకు కూడా ఇది దగ్గరగా ఉన్నట్లు ఆలోచన రాకుండా ఉండదు. ఇంటర్వెల్ బ్యాంగ్ అనేది కథలో ఒక ట్విస్ట్ క్రియేట్ చేసింది. మరీ హై రేంజ్ లో అది లేనప్పటికీ.. ఆ తరువాత సెకండ్ హాఫ్ లోని ట్విస్ట్ లు సన్నివేశాలు ఆసక్తిని కలిగిస్తాయి. కథలో భాగంగా విచారణ సమయంలో ప్రెస్ మీట్‌లు, ఉన్నతాధికారులతో విభేదాలు ఇలా రొటీన్ సీన్స్ ఇంతకుముందు చాలా సినిమాల్లో చూసినట్లే అనిపిస్తాయి.
ప్రీ-క్లైమాక్స్‌కి దారితీసే క్లూలు కొన్ని ఫస్ట్ హాఫ్ కు సంబంధం ఉండడం వంటి సీన్స్ అయితే కొత్తగా అనిపిస్తాయి. ఇక చివరలో బ్యాంగ్ ట్విస్ట్ ఓకే కానీ త్రిల్లర్ సినిమాలకు అలవాటు పడిన సినీ లవర్స్ కు అంతగా కిక్కేమి ఇవ్వదు. మొత్తంమీద, హిట్ 2 అనేది నార్మల్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా అనిపిస్తుంది. పెద్దగా అంచనాలు లేకుండా సినిమా చూస్తే నచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఈ సినిమాకు ఎక్కువగా ఉపయోగపడింది జాన్ స్టీవర్ట్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్. అలాగే ఎస్ మణికందన్ సినిమాటోగ్రఫీ విజువల్స్‌తో ఎఫెక్ట్‌ను పెంచింది.
ప్లస్ పాయింట్స్:
👉క్లైమాక్స్
👉అడివి శేష్ నటన
👉బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
మైనస్ పాయింట్స్:
👉కొన్ని రొటీన్ సీన్స్
👉ప్రీ ఇంటర్వెల్
రేటింగ్: 3/5
Follow
Post a Comment