మెగా అల్లుడి కోసం ఎన్టీఆర్!

 మెగా మేనల్లుడు యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా SDT 15 మళ్లీ వార్తల్లోకి వచ్చింది.  కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అయితే ఈ సినిమా టైటిల్‌ తో పాటు టీజర్‌ను డిసెంబర్ 7 విడుదల చేయనున్నారనేది తాజా సమాచారం. అయితే టీజర్ ను జూనియర్ ఎన్టీఆర్ లాంచ్ చేస్తారని ఒక టాక్ వైరల్ అవుతోంది.


దీనిపై స్పష్టత రావాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ తో పాటు సుకుమార్ రైటింగ్స్ సగర్వంగా నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌లో సాయి ధరమ్ తేజ్‌తో కు జోడిగా సంయుక్త మీనన్ నటిస్తోంది. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రంలో అజయ్, బ్రహ్మాజీ, సునీల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.  కాంతారావు ఫేమ్ అంజనీష్ లోక్‌నాథ్ సంగీత అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

Post a Comment

Previous Post Next Post