ఉపాసన ప్రెగ్నెన్సీ.. ఇన్నేళ్ళ తరువాత ఎందుకంటే!


2012లో ఉపాసన రాంచరణ్ వివాహం జరిగిన విషయం తెలిసిందే. అయితే వీరి మొదటి సంతానం విషయంలో 10 ఏళ్ల తర్వాత ఒక నిర్ణయానికి వచ్చారు. ఇక ఇంత సమయం ఎందుకు తీసుకున్నారు అనే విషయంలో కూడా అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. నిజానికి గత ఐదేళ్ల క్రితమే ఉపాసన ప్రెగ్నెన్సీ అంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.


అయితే ఆ వార్తలపై ఎందుకు అంత ఆసక్తి చూపిస్తున్నారో అర్థం కావడం లేదు అని.. అది తమ వ్యక్తిగత విషయం అని పిల్లలను ఎప్పుడు కనాలి అనేది తమ వ్యక్తిగత విషయమని ఉపాసన గతంలోను ఒక క్లారిటీ ఇచ్చింది. అయితే ఇప్పుడు మాత్రం మెగా కొణిదల ఫ్యామిలీలో మరో తరానికి ఉపాసన రాంచరణ్ బాటలు వేయబోతున్నారు. ఇక లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం ఉపాసన ఇష్ట ప్రకారమే ఇప్పుడు మెగా వారసులకు జన్మనివ్వబోతున్నట్లుగా తెలుస్తోంది.

ఇంతకాలం అపోలోకు సంబంధించిన చాలా బాధ్యతలను ఆమె చేపట్టారు. మధ్యలో రామ్ చరణ్ తో ఆమె ఎన్నో విహార యాత్రలు కూడా చేశారు. అయితే రీసెంట్గా ఆమె అపోలోకు సంబంధించిన బాధ్యతలకు కొంత విరామం కూడా ఇచ్చారు. ఈ క్రమంలో ప్రెగ్నెన్సీ విషయంలో ఆమె నిర్ణయం తీసుకున్నారు. తల్లి కావడానికి ఇది సరైన సమయం అని డిసైడ్ అయ్యారట. ఏదేమైనా మొత్తానికి శుభవార్త చెప్పడంతో ఫ్యాన్స్ అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు.

Post a Comment

Previous Post Next Post