బాలయ్య కోసం ప్రభాస్ స్పెషల్ ఫుడ్


ప్రభాస్ ఇటీవల నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో లో పాల్గొన్న విషయం తెలిసిందే. తన ప్రాణ స్నేహితుడు గోపీచంద్ తో కలిసి ప్రభాస్ ఈ టాక్ షోను పూర్తి చేశాడు. అయితే ప్రభాస్ ఎవరు కలిసినా కూడా ముందుగా తన భోజనాలతోనే వారికి ఒక సర్ ప్రైజ్ అయితే ఇస్తూ ఉంటాడు. ఇక బాలయ్య షోలో పాల్గొనే ముందు ప్రత్యేకంగా ఫుడ్ రెడీ చేయించి తీసుకొచ్చినట్లుగా తెలుస్తోంది.

ఇక బాలయ్య సన్నిహితులకు ప్రత్యేకంగా ఫోన్ చేసి ఆయనకు ఇష్టమైన వంటకాలను కూడా అడిగి తెలుసుకున్న ప్రభాస్ భీమవరం చేపల పులుసు అలాగే ఫిష్ ఫ్రై కూడా చేయించాడు. ముఖ్యంగా బాలయ్యకు మటన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం అని తెలుసుకున్న బాలయ్య స్పెషల్ గా వాటికి సరిపడిపోయే కబాబ్స్ తో కూడా రెడీ చేయించారట. ఇక ప్రభాస్ తీసుకొచ్చిన వంటకాలను బాలయ్య మాత్రమే కాకుండా అన్ స్టాపబుల్ టీమ్ కూడా తిన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై కూడా షోలో బాలయ్య ప్రభాస్ గురించి ప్రత్యేకంగా మాట్లాడాడు. ఈ ఎపిసోడ్ క్రిస్మస్ కానుకగా ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.

Post a Comment

Previous Post Next Post