వినరో భాగ్యము విష్ణు కథ.. ప్రమోషన్స్ తో పాజిటివ్ వైబ్రేషన్స్!


రాజావారు రాణి గారు అని సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కిరణ్ అబ్బవరం ఆ తర్వాత SR కళ్యాణ మండపం అనే సినిమాతో కూడా మంచి సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత వచ్చిన సెబాస్టియన్ కూడా డిఫరెంట్ గానే వచ్చింది. ఇక సమ్మతమే కూడా ఓవర్గం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఇక తర్వాత నేను మీకు బాగా కావాల్సిన వాడిని అనే సినిమాతో కిరణ్ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. 

సక్సెస్ అయితే సక్సెస్ అయ్యింది అని లేదంటే లేదు అని ఒప్పుకునే ఈ హీరో రిజల్ట్ విషయంలో మాత్రం చాలా జెన్యూన్ గా ఉంటాడు అనేది ఇదివరకే అర్థమయింది. ఇక ఇప్పుడు ఇతను గీతా ఆర్ట్స్ సంస్థ నుంచి 'వినరో భాగ్యము విష్ణు కథ' అనే సినిమాతో రాబోతున్నాడు. సొంత టాలెంట్ తో అల్లు అరవింద్ ప్రొడక్షన్లో మంచి ఛాన్స్ అందుకున్న కిరణ్ ఈసారి ఎలాంటి సక్సెస్ అందుకుంటాడు అనేది ఆసక్తికరంగా మారింది.

ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటున్నాయి. ఇప్పటివరకు విడుదలైన పోస్టర్స్ టీజర్స్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే సాంగ్స్ కూడా బాగానే ఆ కట్టుకున్నాయి. లుక్స్ విషయంలో అయితే ఈ హీరో డిఫరెంట్ గా ప్రయత్నం చేశాడు. ఫస్ట్ లుక్ లో మాస్ అవతారం ఆ తర్వాత మళ్లీ క్లాస్ లుక్ లో పల్లకి మోసుకుంటు కనిపించడం బాగానే క్లిక్ అయ్యాయి. ఆ లుక్స్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. విడుదలైన మొదటి సాంగ్ కూడా బాగానే ఆకట్టుకుంది.

ఇక మొన్న యూత్ ను ఎంతగానో మెప్పిస్తూ ఓ బంగారం సాంగ్ కూడా బాగా వైరల్ అయింది. మొత్తానికి ప్రతి కంటెంట్ కూడా చాలా రిఫ్రెష్ గా ఉంది అనేలా ప్రమోషన్స్ అయితే చేస్తున్నారు. ఇక ఫిబ్రవరి 17వ తేదీన ఈ సినిమా విడుదల కావునంది. శివరాత్రికి తెలుగులో మోస్ట్ అవేటింగ్ మూవీ అనేలా టాక్ కూడా అందుకుంది. మరి కిరణ్ ఈసారి ఎంతవరకు ఆకట్టుకుంటాడో చూడాలి.

ఈ సినిమా నుంచి దర్శన అనే ఒక సాంగ్ తో పాటు ట్రైలర్ ను కూడా విడుదల చేయనున్నారు. ఇక ఇన్ సైడ్ బజ్ ఏమిటి అంటే ఈ సినిమాను ప్రత్యేకంగా వీక్షించిన నిర్మాత అల్లు అరవింద్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అని తెలుస్తోంది. అంతేకాకుండా ప్రమోషన్ విషయంలో కూడా వారికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతో చిత్ర యూనిట్ కూడా జనాలందరికి దగ్గరయ్యే విధంగా ప్రమోషన్ చేస్తోంది. ఈ మధ్య విజయవాడలో క్రికెట్ తో కూడా ప్రమోషన్ చేసిన విధానం బాగానే హైలెట్ అయింది. మొత్తానికి టీమ్ అందరూ కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ తో సినిమాకు మంచి హైప్ క్రియేట్ చేస్తున్నారు. మరి సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

Post a Comment

Previous Post Next Post