శ్రుతిహాసన్.. సంక్రాంతి సినిమాల రెమ్యునరేషన్ ఎంత?


టాలెంటెడ్ హీరోయిన్ శృతి హాసన్ గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తోంది. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో అయితే అద్భుతమైన సినిమాలు ఉన్నాయి. ఓ వైపు పాన్ ఇండియా మూవీ సలార్ ఉండగా ఈ సంక్రాంతికి ఇద్దరు స్టార్ హీరోల సినిమాలతో రానుంది. నందమూరి బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమాతో పాటు మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య రెండు కూడా సంక్రాంతికి రాబోతున్న విషయం తెలిసిందే.

అయితే ఈ రెండు సినిమాలకు ఆమె మైత్రి మూవీ మేకర్స్ నుంచి భారీ స్థాయిలో రెమ్యునరేషన్ అందుకున్నట్లుగా తెలుస్తోంది. ఒక్క సినిమాకు రెండు కోట్లకు పైగానే తీసుకున్న శృతి రెండు సినిమాలకు కలిపి ఐదు కోట్ల వరకు  తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ రెండు సినిమాలపై కూడా అంచనాలు అయితే గట్టిగానే ఉన్నాయి. ఇక ఏ సినిమా సక్సెస్ అయినా కూడా బ్యూటీకి మరో ఏడాది కలిసి వచ్చినట్లే. మరి రెండు సినిమాలలో ఏ సినిమా అత్యధిక స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి.

Post a Comment

Previous Post Next Post