కొరటాల శివ ఆచార్య సినిమా అనంతరం మళ్లీ ఎన్టీఆర్ సినిమాను మొదలుపెట్టడానికి చాలా సమయం తీసుకున్నాడు. ఇక మొత్తానికి ఈ ప్రాజెక్టు షూటింగ్ అయితే మరికొన్ని రోజుల్లో మొదలు కాబోతోంది. అయితే ఈసారి కొరటాల శివ ఆచార్య చేసిన సినిమాకు చేసినట్లుగా కొన్ని పొరపాట్లు చేయకూడదని ఫిక్స్ అయ్యాడు. ముఖ్యంగా బిజినెస్ విషయంలో ఏమాత్రం తలదూర్చకూడదని అని అనుకుంటున్నాడు.
ఆచార్య సినిమాతో పాటు అంతకుముందు సినిమాలకు కూడా కొరటాల శివ లాభాల్లో వాటా తీసుకుంటూ వచ్చాడు. అంతే కాకుండా బిజినెస్ డీల్స్ కూడా అతనే సెట్ చేస్తూ డిస్ట్రిబ్యూషన్స్ లో కూడా తలదూర్చాడు. ఇక ఆచార్య సినిమాకు అతనిపై అది గట్టి ప్రభావం చూపించింది. అందుకే ఈసారి ఎన్టీఆర్ 30 వ ప్రాజెక్టు విషయంలో సైలెంట్ గా 20 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకొని సైడ్ అయిపోతున్నాడట. మరి ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.
Follow
Post a Comment