మెగాస్టార్ చిరంజీవి ఇటీవల కాలంలో సెలెక్ట్ చేసుకుంటున్న కథలు అలాగే దర్శకులను ఎంచుకునే విధానం కూడా ఫాన్స్ లో కొంత టెన్షన్ను కలిగిస్తోంది. చాలా రొటీన్ కమర్షియల్ సినిమాలు చేస్తున్నారు అనే విధంగా కూడా కామెంట్స్ వస్తున్నాయి. అయితే మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా అనంతరం భోళా శంకర్ సినిమాతో రాబోతున్నారు. ఇక ఆ తర్వాత వెంకీ కుడుమల సినిమా కూడా లైన్లో ఉంది.
ఈ క్రమంలో మరి కొంతమంది టాలీవుడ్ దర్శకులు కూడా ఆయన లిస్టులో ఉన్నారు. అయితే ఇండియన్ మైకల్ జాక్సన్ గా గుర్తింపు అందుకున్న డాన్స్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా దర్శకత్వంలో కూడా మెగాస్టార్ సినిమా చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. పలు రీమేక్ సినిమాలతో ప్రభుదేవా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాలను అందుకున్నాడు.
కానీ 2007లో మెగాస్టార్ రాజకీయాల్లోకి వెళ్లే ముందు ప్రభుదేవా దర్శకత్వంలో శంకర్ దాదా జిందాబాద్ అనే సినిమా చేశాడు. ఆ సినిమా డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే. మళ్ళీ ఇప్పుడు ఈ దర్శకుడితో ఒక సినిమా చేసేందుకు చర్చలు మొదలుపెట్టినట్లు సమాచారం. మరి కాంబినేషన్ ఫైనల్ అవుతుందో లేదో చూడాలి.
Follow
Post a Comment