ప్రభాస్ ఫ్యాన్స్ నిజంగా లక్కీ!


రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. కేవలం 8 నెలల వ్యవధిలోనే మూడు సినిమాలు రాబోతున్నాయి అంటే మామూలు విషయం కాదు. అందులోనూ పాన్ ఇండియా బిగ్ బడ్జెట్ సినిమాలు కావడం విశేషం. ఆదిపురుష్ సినిమా జూన్ 16వ వస్తుండగా.. సెప్టెంబరు 28న సలార్ రాబోతోంది. ఇక ప్రాజెక్టు కే సినిమా 2024 సంక్రాంతికి ఫిక్స్ అయిన విషయం తెలిసిందే.

అయితే మిగతా కొంతమంది ఆగ్రహ హీరోల ఫ్యాన్స్ మాత్రం వచ్చే ఏడాది వరకు కేవలం ఒక్క సినిమాతోనే సరి పెట్టుకోవాల్సి ఉంటుంది. పవన్ సంగతి పక్కనపెడితే.. మహేష్ బాబు 28వ సినిమా ఈ ఆగస్ట్ లో రానుండగా అల్లు అర్జున్ పుష్ప 2 వచ్చే ఏడాది సమ్మర్ లో రానుంది. ఎన్టీఆర్ 30వ సినిమా ఏప్రిల్ లో రామ్ చరణ్ 16 వ సినిమా కూడా అదే టైమ్ లో వచ్చే ఛాన్స్ ఉంది. ఇక ఈ సినిమాలలో ఏ సినిమా ప్లాప్ అయినా కూడా ఫ్యాన్స్ కొలుకోవాడనికి చాలా టైమ్ పడుతుంది. మళ్ళీ మరో సినిమా రావాలి అంటే ఏడాదిన్నర సమయం పట్టవచ్చు. మరి ఆ స్టార్స్ ఎలాంటి రిజల్ట్ అందిస్తారో చూడాలి.

Post a Comment

Previous Post Next Post