నందమూరి తారకరత్న ఫిబ్రవరి 18న కన్నుమూశారు. ఆయన మృతి అతని భార్య అలేఖ్యారెడ్డితో పాటు పిల్లలను కలిచివేసింది. ఇక ఫిబ్రవరి 22న తారకరత్న పుట్టినరోజు కావడంతో అతని స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు చాలా మంది అతనిని గుర్తు చేసుకున్నారు. ఇక తారకరత్న భార్య తన సోషల్ మీడియా పేజీలో ఎమోషనల్ పోస్ట్ చేసింది.
అలేఖ్య రెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో, ‘డి బెస్ట్ ఫాదర్, బెస్ట్ భర్త అంటూ.. అద్భుతమైన హ్యూమన్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు.. మిస్ యూ నానా.. ఐ లవ్ యూ సో మచ్..’ అని పేర్కొంది. తారకరత్న తన కుమార్తె నిష్కాను కౌగిలించుకున్న ఫొటోను ఆమె పోస్ట్ చేసింది. అలేఖ్య భావోద్వేగ పోస్ట్‌పై తారకరత్న అభిమానుల నుండి ‘మిస్ యు అన్నా’ అనే సందేశాలు వస్తున్నాయి. అలాగే తారకరత్న ఆత్మకు శాంతి చేకూరాలి అని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
Follow
0 Comments