దసరా మూవీ - రివ్యూ & రేటింగ్


కథ:
దసరా.. ముగ్గురు స్నేహితులైన ధరణి (నాని), వెన్నెల (కీర్తి సురేష్), సూరి (శెట్టి) చుట్టూ తిరిగే గ్రామీణ కథ. ఇక గోదావరిఖని కోల్ మైన్ బ్యాక్ డ్రాప్ లో 1995లో జరిగిన కథాంశం ఇది. ఇక గ్రామ సర్పంచ్ నంబి (షైన్ టామ్ చాకో) ప్రధాన ముగ్గురి జీవితాలను ఎలా ప్రభావితం చేశాడు? ఇక ధరణి వెన్నెల విషయంలో తీసుకున్న నిర్ణయం ఏంటి? అలాగే అతని జీవితంలో ఎదుర్కొన్న పెద్ద షాక్ ఏంటి? అనేది సినిమాలోని ప్రధాన కథాంశాలు. 

విశ్లేషణ:
దసరా సినిమా చాలా ఆసక్తిగా విడుదలకు ముందే పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది. తెలంగాణా సింగరేణి పల్లెటూరి నేపథ్యంతో కొనసాగే ఈ సినిమా కథలో త్యాగం స్నేహం అనే పాయింట్స్ ను టచ్ చేసినప్పటికీ సూపర్ అని చెప్పుకోదగ్గ రేంజ్ లో ప్రజెంట్ చేయలేదు. కానీ అక్కడక్కడా సీన్స్ తోనే సినిమాను స్ట్రాంగ్ గా ఎలివేట్ చేసిన ప్రయత్నాలు వర్కౌట్ అయ్యాయి. అయితే దర్శకుడు శ్రీకాంత్ ఓదెల థియేటర్ కు వచ్చిన వారిని అంతగా బోర్ అయితే కొట్టించడు. నాని కీర్తి సురేష్ పాత్రలు చాలా వరకు కథలో లీనమైన విధానం అద్భుతంగా ఉంది. 

కానీ అసలైన పాయింట్ నిజంగా గుర్తుండిపోయేలా ఎలివేట్ చేసే అవకాశాన్ని దర్శకుడు కోల్పోయాడు. ఈ చిత్రం కథ మొదట కాస్త బిన్నంగానే కొనసాగుతుంది. ముఖ్యంగా సర్పంచ్ నంబి థ్రెడ్‌లో ఉంటుంది. అయితే కథ కొనసాగుతున్న తరువాత మధ్యలో సాధారణ రివెంజ్ డ్రామాగా మారుతుంది.

చాలా సన్నివేశాలలో డైలాగ్స్ సినిమాకు ప్రాణంగా నిలిచాయి. డైలాగ్స్ సినిమా యొక్క బలం అని చెప్పవచ్చు. అయితే చౌక గ్రాఫిక్స్‌తో కూడిన ఇంట్రడక్షన్ ట్రైన్ సీక్వెన్స్ ఒక పెద్ద మిస్టేక్స్ లా అనిపించాయి.  సంతోష్ నారాయణన్ అందించిన సంగీతం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పటిష్టంగా ఉన్నాయి, ఇక అద్భుతమైన సాంకేతిక అంశం ఏదైనా ఉందంటే సూర్యన్ అద్భుతమైన సినిమాటోగ్రఫీ అని చెప్పవచ్చు. తక్కువ లైటింగ్ లో వచ్చే సన్నివేశాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఇక ధరణి ప్రధాన పాత్రలో నాని కెరీర్-బెస్ట్ పెర్ఫార్మెన్స్ అందించాడు. అతని తెలంగాణ డిక్షన్ పర్ఫెక్ట్ గా ఉంది. అయితే కీర్తి సురేష్ పల్లెటూరి అమ్మాయి తరహాలో బాగానే నటించినా.. ఆమె కొన్ని సన్నివేశాలు అతిగా అనిపిస్తాయి.  సూరిగా ధీక్షిత్ శెట్టి బెస్ట్ యాక్టింగ్ ఇచ్చాడు, ఇక మలయాళ నటుడు షైన్ టామ్ చాకో మెయిన్ విలన్‌గా మెచ్చుకోదగిన నటనను కనబరిచారు. ఇక, సాయికుమార్  ఝాన్సీ సముద్రఖని పాత్రల నిడివి చాలా తక్కువగానే ఉంటుంది.

దర్శకుడు రాసుకున్న కథను కోల్ మైన్ బ్యాక్ డ్రాప్ లో కాస్త డిఫరెంట్ గా తీసుకు వెళ్లే ప్రయత్నం చేశాడు. కానీ ఆ కథలో ఇంకాస్త లోతుగా కనెక్ట్ అయ్యేలా ఎమోషన్ పండించగలిగి ఉంటే బాగుండేది అనే భావన కలుగుతుంది. సినిమా ఫస్ట్ హాఫ్ మంచి డ్రామా ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేసిన దర్శకుడు సెకండ్ హాఫ్ క్లయిమాక్స్ వరకు మరొక డ్రామాతో వెళ్ళాడు. నటీనటులు కొన్ని ఎపిసోడ్స్ లలో నటించిన విధానం అలాగే టెక్నీషియన్స్ వర్క్ సినిమాలో మెచ్చుకోదగిన విషయాలు.

ప్లస్ పాయింట్స్
👉డైలాగ్స్
👉నాని అద్భుతమైన యాక్టింగ్
👉కొత్త బ్యాక్‌డ్రాప్‌ లో విభిన్నమైన సీన్స్
👉యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయి

మైనస్ పాయింట్స్
👉రొటీన్ గా సాగే రివెంజ్ డ్రామా
👉కీలకమైన ఎపిసోడ్స్ లో ఎమోషన్స్ మిస్సింగ్
👉నిదానంగా సాగే కథనం

రేటింగ్: 3/5

Post a Comment

Previous Post Next Post