సలార్.. ఫ్యాన్స్ చొక్కాలు చించుకునే ఫైట్!


రెబల్ స్టార్ ప్రభాస్ లైనప్ లో ఎన్ని పాన్ ఇండియా సినిమాలు ఉన్నా కూడా మాస్ ఫ్యాన్స్ ఫోకస్ ఎక్కువగా అయితే సలార్ సినిమా పైనే ఉంది. ప్రశాంత్ నిల్ దర్శకత్వంలో తెరపైకి రాబోతున్న ఈ సినిమా సెప్టెంబర్ 28 విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమాలో యాక్షన్స్ సీన్స్ కూడా ఊహించని స్థాయిలోనే ఉంటాయని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. 

ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం ఫ్యాన్స్ కు నచ్చే విధంగా ప్రభాస్ కు సెట్ అయ్యే విధంగా ఒక ఫైట్ కూడా డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మిర్చి సినిమాలో ప్రభాస్ రెయిన్ ఫైట్ కు ఏ స్థాయిలో గుర్తింపు లభించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే ఎన్నిసార్లు చూసినా ఫైట్ బోర్ కొట్టదు. ఆల్ టైం బెస్ట్ యాక్షన్ సన్నివేశాలలో అది కూడా ఒకటి. ఇక సలార్ సినిమాలో కూడా ప్రభాస్ వర్షంలో విలన్స్ ను ఊచకోత కోసే యాక్షన్ ఎపిసోడ్ చాలా హైలెట్ గా ఉంటుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాను కూడా రెండు భాగాలుగా తెరపైకి తీసుకురావాలి అని దర్శకుడు ప్రణాళికలు రచిస్తున్నాడు.

Post a Comment

Previous Post Next Post