మాస్ కమర్షియల్ యాక్షన్ దర్శకుడిగా మంచి గుర్తింపు అందుకున్న బోయపాటి శ్రీను తన తదుపరి సినిమాను రామ్ పోతినేనితో చేస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా ప్రాజెక్టుగా రాబోతున్న ఈ సినిమా సంబంధించిన షూటింగ్ కూడా మొదలైపోయింది. అయితే ఇప్పటికే రామ్ లుక్కు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.
అయితే రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ లోనే దర్శకుడు మరోసారి తనకు సెట్ అయ్యే ఫార్ములా తోనే కథను సెట్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో రామ్ 50 ఏళ్ల వ్యక్తిగా కూడా కనిపిస్తాడట. కష్టాల్లో ఉన్న తన వాళ్లకోసం మళ్లీ అతను హఠాత్తుగా రీఎంట్రీ ఇచ్చి విలన్స్ ను ఊచపోతే కోసే సన్నివేశాలు కూడా హైలెట్ అవుతాయట. దాదాపు బోయపాటి ప్రతి సినిమాలో కూడా ఏదో ఒక రకంగా హీరో కష్టాల్లో ఉన్న తన వారి కోసం హఠాత్తుగా ప్రత్యక్షమై కొట్టడం అనేది కామన్. ఇక రామ్ 50 ఏళ్ల వ్యక్తిగా కనిపిస్తాడు అంటే బహుశా డబుల్ యాక్షన్ కూడా ఉంటుందేమో అని డౌట్ వస్తోంది. మరి బోయపాటి ఎలాంటి షాక్ ఇస్తాడో చూడాలి.
Follow
Post a Comment