జోరు తగ్గని కిరణ్ అబ్బవరం..!


టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో కిరణ్ అబ్బవరం విభిన్న చిత్రాల్లో నటిస్తూ తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఈయన హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు. అయితే డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీస్ తో ఎప్పుడూ ప్రేక్షకుల ముందుకు వచ్చే ఈయన.. ఇటీవలే వినరో భాగ్యము విష్ణు కథ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు.

అదే ఊపులో నూతన డైరెక్టర్ రమేష్ కడూరి దర్శకత్వంలో మరో సినిమా చేశాడు. అదే మీటర్. అయితే ఈ సినిమాపై భారీ బజ్ క్రియేట్ అయినప్పటికీ బాక్సాఫీసు వద్ద ఫ్లాప్ గా నిలిచింది. దీంతో తానేం తప్పు చేశాను, ఈ సినిమా ఫ్లాప్ గా నిలవడానికి గల కారణాలు ఏంటని కిరణ్ అబ్బవరం బేరీజు వేసుకున్నాడు. అందులో చేసిన తప్పులు మళ్లీ చేయకూడదని డిసైడ్ అయ్యాడు.

ఈ క్రమంలోనే మాంచి హిట్టు సినిమాతో రావాలనే కసితో మరో ప్రాజెక్టు చేసేందుకు సిద్ధమైపోయాడీ కుర్ర హీరో. హిట్టు కొట్టేందుకు కావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ తీసుకొని ఆసక్తికరమైన లైనప్ తో రాబోతున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. వాటిని ఏ మాత్రం జార విడుచుకోకుండా.. మంచి ప్లానింగ్ తో నాలుగు సినిమాలను లైన్ లో పెట్టాడు కిరణ్. ఈ నాలుగు చిత్రాల్లో ఒకటి మల్టీ స్టారర్ చిత్రం అని సమాచారం. ఈ సినిమాలో కిరణ్ అబ్బవరంతో ఓ స్టార్ హీరో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారట. అలాగే ఓ పెద్ద బ్యానర్ ఈ ప్రత్యేకమైన ప్రాజెక్టును నిర్మిస్తుందట.

కేవలం హీరోగానే కాకుండా స్వయంగా తానే ఈ సినిమాకు స్క్రిప్టు కూడా రాసుకుంటున్నాడట. ఓ కొత్త డైరెక్టర్ ఈ సినిమాను తెరక్కించబోతున్నారని టాక్. అలాగే లవ్ యాక్షన్ డ్రామా కథాంశంతో మరో చిత్రం రూపొందుతుండగా... విశ్వ కరుణ్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే ఈ సినిమాకు కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ సామ్ సీఎస్ సంగీతం అందిస్తుండగా.. ఇటీవలే ఈ చిత్రం ప్రారంభోత్సవ వేడుక జరిగింది. శివం సెల్యూలాయిడ్స్ పతాకంపై రవి జోజో జోస్, రాకేశ్ రెడ్డి ఈ సినిమాను నిర్మించబోతున్నారు.

ఇవే కాకుండా మరో ప్రాజెక్టు చర్చల దశలో ఉంది. ఈ చిత్రాన్ని బాలీవుడ్ అగ్ర సంస్థతో నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారట. అయితే కిరణ్ అబ్బవరం సినిమాలన్నీ భారీ స్థాయిలో చిత్రీకరించనున్నట్లు సమాచారం. ఈ లైనప్ ని చూస్తుంటే కిరణ్ అబ్బవరం నిజంగానే తన కెరియర్ పై చాలా జాగ్రత్తలు తీసుకున్నాడని అర్థం అవుతోంది. అలాగే ఈ నాలుగు చిత్రాలు హిట్టుగా నిలిచేందుకు తాను చాలా కష్ట పడుతున్నాడని తెలుస్తోంది. మరి చూడాలి.. ఈ కుర్రహీరో అదృష్టం ఎలా ఉందో.

Post a Comment

Previous Post Next Post