ఉగ్రం మూవీ - రివ్యూ & రేటింగ్


కథ:
సిఐ శివ కుమార్ (అల్లరి నరేష్) వరంగల్ నగరంలో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా కొనసాగుతూ ఉంటాడు. ఇక అతను అపర్ణతో ప్రేమలో పడతాడు (మీర్నా మీనన్). అపర్ణ తండ్రి కోరికకు వ్యతిరేకంగా పెళ్లి చేసుకున్న హీరో 5 సంవత్సరాల సంతోషకరమైన జీవితం తరువాత ఊహించని విధంగా ఒక ప్రమాదానికి గురవుతారు. దీంతో కుటుంబం ప్రమాదంతో ఛిన్నాభిన్నమవుతుంది. ఇక శివ జ్ఞాపకశక్తిని కోల్పోతాడు. అతని భార్య కూతురు కనిపించారు. శివ తన కుటుంబాన్ని కనుగొనడానికి ఏం చేశాడు అనేది మిగిలిన కథ.

విశ్లేషణ:
2021లో నరేష్ ‘నంది’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన విజయ్ కనకమేడల విమర్శకులను మెప్పించారు. ఇక ఇప్పుడు మళ్ళీ విన్నింగ్ కాంబినేషన్‌ను రిపీట్ చేస్తూ ఉగ్రం అనే సినిమాతో వచ్చారు. ఉగ్రం సినిమా ప్రమోషన్స్ ద్వారా కొంత బజ్ అయితే క్రియేట్ చేసింది. ఇక సినిమా విషయానికి వస్తే మాత్రం కొన్ని సన్నివేశాలు సీరియస్ మోడ్ లో కఠినంగా అమలు చేయబడ్డాయి. 

ఫస్ట్ హాఫ్ లో దర్శకుడు ఎక్కువగా సాగదీయకుండా కథలోకి తీసుకు వెళ్ళాడు. కానీ సాంగ్స్ సీన్స్ స్క్రీన్ ప్లే మాత్రం అంతగా కనెక్ట్ అవ్వదు. మొదట్లో ఒక మంచి చిత్రాన్ని చూస్తున్న అనుభూతిని పొందుతారు అనేలోపే.. గ్యాప్ లేకుండా చిరాకు తెప్పించే సీన్స్ కొన్ని వస్తాయి. ఓల్డ్ స్కూల్ చైల్డ్ సెంటిమెంట్ ట్రాక్ సహనాన్ని పరీక్షిస్తుంది. ఫ్యామిలీ ఫాదర్ డాటర్ సీన్స్ లో కొత్తదనం ఏమి ఉండదు. దాని తర్వాత చాలా సినిమా కథ కొంత వేగాన్ని పెంచుకుంటుంది. 

అయితే కొన్ని సీన్స్ అంతగా నమ్మదగినవిగా అనిపించవు. ముఖ్యంగా హౌస్ అరెస్ట్ తర్వాత కూడా సీఐ విచారణ పేరుతో స్వేచ్చగా తిరుగుతుండడం కన్ఫ్యూజన్ ను క్రియేట్ చేస్తుంది. తప్పిపోయిన వ్యక్తులకు సంబంధించిన సీన్స్ కాస్త ఆసక్తిగా అనిపిస్తాయి. కానీ ఫైనల్ గా రొటీన్ గానే ముగుస్తుంది. ఈ దర్శకుడు ఒక విభిన్నమైన క్రైమ్ థ్రిల్లర్ ను అటెంప్ట్ చేసినప్పటికీ ఉగ్రం చిత్రం ఆ దిశగా ఆకట్టుకోలేదు. 

కొన్ని మాస్ యాంగిల్స్ ఓకే అనిపిస్తాయి. యాక్టింగ్ పరంగా చూసుకంటే.. హీరో హీరోయిన్లు బాగా నటించారు. ఇక మిగిలిన నటీనటులకు చెప్పుకోదగ్గ పాత్రలు లేవు.  షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి.  ఇందులో రెండు పాటలు మంచి బడ్జెట్‌తో చిత్రీకరించబడ్డాయి.  శ్రీచరణ్ సంగీతం ఓకే.  టార్గెట్ చేయబడిన మాస్ ప్రేక్షకులకు ఈ సినిమా సగటు స్థాయిలో నచ్చవచ్చు కానీ ఇతరులకు పెద్దగా కనెక్ట్ కాదు.

ప్లస్ పాయింట్స్:
👉నరేష్ పోలీస్ క్యారెక్టర్
👉ఫస్ట్ హాఫ్
👉ప్రొడక్షన్ వాల్యూస్

మైనస్ పాయింట్స్:
👉సెంటిమెంట్ సీన్స్
👉సెకండ్ హాఫ్

రేటింగ్: 2.5/5

Post a Comment

Previous Post Next Post