ఐకాన్ కథ ఎంతమంది చుట్టూ తిరిగిందంటే..


అల్లు అర్జున్ ఐకాన్ కథను ఎంతో ఇష్టంగా తెరపైకి తీసుకురావాలని అనుకున్నది మాత్రం వాస్తవమే. పుష్ప సినిమా కంటే ముందే ఈ కథ చాలా వరకు సిద్ధం అయిపోయింది. దర్శకుడు వేణు శ్రీరామ్ కూడా బన్నీ ఆలోచనలతోనే ట్రావెల్ చేశాడు. అతని బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టుగా పూర్తిస్థాయిలో స్క్రిప్టు కూడా రెడీ చేసుకున్నాడు. ఇక పుష్ప తర్వాత వెంటనే మొదలు పెట్టాలని అనుకున్నారు. 

కానీ పుష్ప 1 సినిమా రిసల్ట్ తో ఐకాన్ కథ అతని మనసులో చాలా చిన్నగా అనిపించింది. ఇది ఇప్పుడు ఉన్న క్రేజ్ తో చేయడం కరెక్ట్ కాదు అని దిల్ రాజుతో కూల్ గా సెటిల్ చేసుకుని వెనక్కి తగ్గాడు. అయితే ఆ తర్వాత దిల్ రాజు అదే కథను మరి కొంతమంది యువ హీరోలకు చెప్పమని దర్శకుడికి చెప్పాడు. ఇక అందులో రామ్ కూడా ఉన్నాడు. 

అయితే బన్నీ రిజెక్ట్ చేసిన కథను అతను చేయడానికి అసలు పెద్దగా ఆసక్తి చూపించలేదు. అలాగే విజయ్ దేవరకొండకి కూడా ఒకసారి వినిపించారు. కానీ అతను కూడా ఒప్పుకోలేదు. ఇక ఫైనల్ గా నితిన్ వద్దకు చేరడంతో అతను తన బాడి లాంగ్వేజ్ కు తగ్గట్టుగా స్క్రిప్ట్ సిద్ధం చేయమని కొన్ని సలహాలు ఇచ్చాడట. ఇక ప్రస్తుతం అదే పనిలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే నితిన్ ఐకాన్ స్క్రిప్ట్ పై సరికొత్త టైటిల్ తో అధికారిక అప్డేట్ రానుంది.

Post a Comment

Previous Post Next Post