భగవంత్ కేసరి.. హైలైట్స్ ఇవే!


నందమూరి బాలకృష్ణ అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్న భగవంత్ కేసరి సినిమాపై మాస్ ఆడియెన్స్ లో అంచనాలు గట్టిగానే పెరుగుతున్నాయి. ఇక ఈ సినిమాలో నేవార్ బిఫోర్ అనేలా బాలయ్య బాబు తెలంగాణ భాషలో పవర్ఫుల్ డైలాగ్ లతో మెప్పించనున్నాడు. దర్శకుడు అనిల్ రావిపూడి ఇందులో తన మార్క్ ఎంటర్టైన్మెంట్ పార్ట్ తో పాటు మంచి యాక్షన్ ఎపిసోడ్స్ ను కూడా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా జైల్ సీన్ ఒకటి ఈ సినిమాలో అరాచకం అనేలా ఉంటుందట. ఇక బాలయ్య బాబు యంగ్ గా ఉండే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా గూస్ బంప్స్ తెప్పిస్తుందని తెలుస్తోంది. ఇక మొత్తంగా ఈ సినిమాల్లో నాలుగు యాక్షన్ బ్లాక్స్ తో పాటు ఒక మాస్ ఎపిసోడ్ అలాగే అందులో వచ్చే సాంగ్ కూడా అద్భుతంగా ఉంటుందట. సినిమాలో ఫాదర్ అలాగే డాటర్ ఈ మధ్యలో ఉండే ఒక మంచి బాండింగ్ తో పాటు ఫ్యామిలీ సీన్స్ కూడా బాగా కట్టుకుంటాయని తెలుస్తోంది. లాహిరి లాహిరిలో సినిమాలోని కొన్ని సీన్స్ ను కూడా ఈ సినిమా గుర్తు చేస్తుందని అంటున్నారు మరి ఇది ఎంతవరకు నిజం అవుతుందో చూడాలి.

Post a Comment

Previous Post Next Post