యానిమల్.. అసలు కథ ఏంటి?


అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ప్రస్తుతం హాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ తో యానిమల్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా లీకైన ఫోటోలే అటు బాలీవుడ్ లోను టాలీవుడ్ లోనూ మంచి బజ్ క్రియేట్ చేశాయి. తప్పకుండా పాన్ ఇండియా రేంజ్ లో అయితే రణబీర్ కపూర్ సక్సెస్ అందుకునేలా ఉన్నాడు అనిపిస్తోంది. అంతే కాకుండా ప్రి టిజర్ లుక్కు కూడా బాగానే కిక్ ఇచ్చింది. 

అయితే ఈ సినిమాలో మేయిన్ సోల్ మాత్రం తండ్రి కొడుకుల మధ్య ఉండే ఒక ప్రత్యేకమైన బాండ్ హైలెట్ అవుతుందట. ఇక హఠాత్తుగా  గ్యాంగ్ స్టర్ డ్రామాగా సినిమా ఎలాగ మారుతుంది అనే పాయింట్ కూడా మరింత ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుందని తెలుస్తోంది. దర్శకుడు అయితే అర్జున్ రెడ్డికి పూర్తిస్థాయిలో భిన్నంగా ఈ సినిమాను మరింత వైలెంట్ గా చూపించబోతున్నాడు. అని అర్థమవుతుంది. 

ఒక తండ్రి కోసం హీరో క్రూరమైన వ్యక్తిగా ఎలా మారుతాడు అనే పాయింట్ ఉంటుందట. ఇక దానికి వెనకాల ఉండే ఎమోషనల్ కంటెంట్ ఏమిటి అనేది కూడా సినిమాకు మేజర్ ప్లేస్ పాయింట్ అని తెలుస్తోంది. రణబీర్ కపూర్ ఈ సినిమాతో ఎలాగైనా సౌత్ ఇండస్ట్రీలో కూడా మార్కెట్ క్రియేట్ చేసుకోవాలని అనుకుంటున్నాడు. కంటెంట్ క్లిక్ అయితే మాత్రం అతనికి మంచి మార్కెట్ వచ్చే అవకాశం ఉంది.

Post a Comment

Previous Post Next Post