నిఖిల్ స్పై.. చీకట్లో బాణం!


నిఖిల్ నటించిన స్పై సినిమా ఈవారం గ్రాండ్ గా పాన్ ఇండియా భాషల్లో విడుదలవుతోంది. పాన్ ఇండియా అనే పేరే కానీ ఇప్పటివరకు ఈ సినిమాపై అనుకున్నంత స్థాయిలో అయితే క్రేజ్ ఏర్పడలేదు. కానీ నిఖిల్ మాత్రం మళ్లీ కార్తికేయ 2 ఫార్మాట్లోనే తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. కార్తికేయ 2 సినిమాకు అసలు మిగతా భాషల్లో పెద్దగా మొదట బజ్ అయితే క్రియేట్ కాలేదు. 

ముఖ్యంగా నార్త్ ఇండస్ట్రీలో సినిమా టాక్ అలాగే శ్రీకృష్ణ సెంటిమెంట్ బాగా ఉపయోగపడడంతో జనాలు ఏగబడి చూశారు. ఆ సినిమా 120 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ అందుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు స్పై విషయంలో కూడా నిఖిల్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది అని నమ్మకంతో ఉన్నాడు. ఒక విధంగా ఇది కూడా చీకట్లో బాణం అని చెప్పాలి. కార్తికేయ 2 అసలు ఆ రేంజ్ లో సక్సెస్ అవుతుంది అని ఎవరు అనుకోలేదు. 

ఆ సినిమా కూడా చీకట్లో బానంగా గట్టిగానే తగిలింది. ఇక ఇప్పుడు కూడా అదే తరహాలో బాక్సాఫీస్ టార్గెట్ సెట్ అయింది. కాని నిఖిల్ 100 కోట్ల రేంజ్ లో మార్కెట్ చూసిన తర్వాత కూడా ఇప్పుడు పై సినిమా మాత్రం కనీసం 20 కోట్ల రేంజ్ లో కూడా బిజినెస్ అయితే చేయలేకపోయింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపు 17 కోట్ల రేంజ్ లో బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. ఇక 18 కోట్లు షేర్ అందుకుంటేనే సక్సెస్ అయినట్లు లెక్క. మరి నిఖిల్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.

Post a Comment

Previous Post Next Post