OG: ఓ లుక్ కూడా రాలేదు.. అప్పుడే 18 కోట్లా?


సినీ పరిశ్రమలో పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.  అతను వరుసగా రీమేక్‌లు చేస్తూన్నప్పటికి క్రేజ్ ఈ మాత్రం తగ్గడం లేదు. అయితే సుజీత్‌తో పవన్ చేసిన OG రీమేక్ కాదు. దీంతో ఫ్యాన్స్ ఈ సినిమాపై అంచనాలు గట్టిగానే పెంచుకున్నారు. దీంతో మార్కెట్ లో సినిమాకు డిమాండ్ ఎక్కువవుతోంది. ఇక ఓవర్సీస్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడయ్యాయి.

ట్రేడ్ సర్కిల్స్ ప్రకారం ఈ చిత్రం యొక్క ఓవర్సీస్ హక్కులు 18 కోట్లకు అమ్ముడయ్యాయి. ఇది మామూలు డీల్ కాదని చెప్పవచ్చు.
 “OG” యొక్క ఫస్ట్ లుక్ కూడా ఇంకా విడుదల కాలేదు. చిత్రం విడుదల తేదీ తెలియదు. అయినప్పటికీ ఓవర్సీస్ హక్కుల కోసం రికార్డ్ రేటు రావడం విశేషం. అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఈ డీల్ ద్వారా అర్ధమవుతోంది. పవన్ కళ్యాణ్ యొక్క స్ట్రెయిట్ చిత్రాలకు ఎల్లప్పుడూ క్రేజ్ ఎక్కువగా ఉంటుంది అనే వాస్తవాన్ని నొక్కి చెబుతుంది. ఇక ఈ సినిమాను ఈ ఏడాది డిసెంబర్ లో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు.

Post a Comment

Previous Post Next Post