రెమ్యునరేషన్ లెక్క.. డోస్ పెంచుతున్న శ్రీలీల!


ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో శ్రీలీల పేరు ఎక్కువగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. అమ్మడు వచ్చిన కొత్తలోనే బాక్స్ ఆఫీస్ వద్ద బ్యాక్ టు బ్యాక్ హిట్స్ సొంతం చేసుకుంది. అది కూడా ప్యూర్ కమర్షియల్ సినిమాల ద్వారా ఆమె రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. పెద్ద హీరోల సినిమాలలో కూడా అవకాశాలు అందుకునే విధంగా ప్రయత్నం చేస్తుంది.

ప్రస్తుతం మహేష్ బాబు గుంటూరు కారం సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఆ సినిమాకు శ్రీలీల కేవలం కోటిన్నర రెమ్యునరేషన్ మాత్రమే తీసుకుందట. అయితే ఇప్పుడు నితిన్ వెంకీ కుడుముల సినిమా కోసం కూడా ఆమె రెడీ అవుతోంది. ఆ సినిమాలో మొదటి రష్మికను అనుకున్నప్పటికీ ఆమె తప్పుకోవడంతో ఇప్పుడు శ్రీలీలను అనుకుంటున్నారు.

అయితే ఈ ప్రాజెక్టు అనంతరం ఓకే చేయబోయే సినిమాలన్నిటికీ కూడా ఆమె రెండు కోట్ల వరకు తీసుకోవాలని అనుకుంటుందట. ఇప్పటికే కొంతమంది నిర్మాతలు ఆమెను సంప్రదించగా రెండు కోట్ల కంటే తక్కువ తీసుకొనని అని క్లారిటీ చేసినట్లుగా తెలుస్తోంది. అలాగే తమిళంలో అమ్మడు కార్తీ, శివకార్తికేయన్ వంటి హీరోలతో ఛాన్స్ లు అందుకునేందుకు రెడీ అవుతున్నట్లు టాక్.

Post a Comment

Previous Post Next Post