బ్రో సినిమాలో.. పొలిటికల్ గా ఓకే ఒక్క కౌంటర్!


పవన్ కళ్యాణ్ బ్రో సినిమా అసలు ఎలాంటి పొలిటికల్ అంశాలకు తావు ఇవ్వకుండా చాలా కూల్ గా విడిదలయ్యింది. ఇంతకుముందు పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ తో పాటు భీమ్లా నాయక్ రెండు కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా అయితే నిలిచాయి. అంతేకాకుండా అధికార నాయకులు ఆ రెండు సినిమాల విడుదల టైంలో అయితే బాగానే టార్గెట్ చేశారు అనిపించింది.

అయితే గత రెండు సినిమాలలో అధికార పార్టీపై ఏదో ఒక విధంగా కౌంటర్ ఇచ్చిన సందర్భాలు అయితే ఎక్కువగానే కనిపించాయి. అయితే బ్రో సినిమాలో మాత్రం ఒకే ఒక్క సందర్భంలో కాస్త హెచ్చరికలు చేసి చేయనట్లుగా పవన్ కళ్యాణ్ డైలాగ్స్ వదిలారు. గాజు గ్లాస్ ను అక్కడక్కడా హైలెట్ చేసిన పవన్ కొన్ని డైలాగ్స్ లలో కౌంటర్ ఇచ్చినట్లు అనిపిస్తుంది.

ఒక మనిషి కేవలం భూమి మీదకు వచ్చిన గెస్ట్ మాత్రమే.. అలానే జీవించాలి.. అంతే కాని ఇష్టం వచ్చినట్లు తవ్వేస్తాం.. దోచేస్తాం.. అంటే కుదరదు.. అంటూ ఇసుక మాఫియా గురించి కూడా కౌంటర్ ఇచ్చినట్లుగా అర్థమైంది. పూర్తిస్థాయిలో రాజకీయాలకు తావు ఇవ్వకుండానే కాస్త అంతర్లీనంగా పవన్ అక్కడ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను అయితే టచ్ చేసారు అని సోషల్ మీడియాలో కామెంట్స్ అయితే వస్తున్నాయి.

Post a Comment

Previous Post Next Post