తెలుగు నిండా తమిళ మ్యూజిక్ డైరెక్టర్లే..


టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు తమిళ సంగీత దర్శకులకు మంచి అవకాశాలు వస్తున్నాయి. చిన్న సినిమాల నుంచి భారీ పాన్ ఇండియా సినిమాల వరకు కూడా కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ మ్యూజిక్ అందించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. అందులో ఎక్కువగా జీవి ప్రకాష్ కుమార్ చాలా ఆఫర్స్ అందుకుంటున్నాడు. ఇప్పటికే టైగర్ నాగేశ్వరరావు సినిమాకు పని చేస్తున్న అతను నితిన్ వెంకీ కుడుముల సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక త్వరలో రాబోయే ఆదికేశవ కూడా అతను మ్యూజిక్ అందించాడు. దుల్కర్ సల్మాన్ వెంకీ అట్లూరి ప్రాజెక్టుని కూడా జీవి ప్రకాష్ ఓకే చేశాడు.

ఇక అనిరుద్ చేతిలో అయితే రెండు బడా సినిమాలు ఉన్నాయి. ఎన్టీఆర్ దేవరతో పాటు విజయ్ దేవరకొండ 12వ సినిమాకు కూడా అతని మ్యూజిక్ అందించబోతున్నాడు. ఇక AR రెహమాన్ చాలా రోజుల తర్వాత తెలుగు సినిమాలకు మ్యూజిక్ అందించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. రాంచరణ్ 16వ సినిమాతో పాటు నాగచైతన్య చందు మొండేటి కలయికలో రాబోయే సినిమాకు కూడా ఓకే చెప్పే అవకాశం ఉంది. ఇక ఒకప్పటి క్లాస్ మ్యూజిక్ డైరెక్టర్ హరీస్ జయరాజ్ ఇప్పటికీ 32 సినిమా చేస్తుండగా మరోవైపు నాగశౌర్య 24వ సినిమా కూడా చర్చల దశలో ఉంది. ఇక యువన్ శంకర్ రాజ మాత్రం విశ్వక్సేన్ 11వ సినిమా చేస్తున్నాడు.

Post a Comment

Previous Post Next Post