టబు నాగ్.. మళ్ళీ ఇన్నాళ్ళకు..!


టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ ఎప్పటికీ కూడా మర్చిపోలేని విధంగా ఉంటాయి. ముఖ్యంగా హీరో హీరోయిన్స్ కాంబినేషన్స్ కు అప్పట్లో ఏ స్థాయిలో గుర్తింపు ఉండేదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే అందులో నాగార్జున టబు కాంబినేషన్ కు కూడా మంచి క్రేజ్ ఉండేది. వీరి కాంబినేషన్లో ఎన్ని సినిమాలు వచ్చినా కూడా అందరికీ ఎక్కువగా గుర్తొచ్చేది మాత్రం నిన్నే పెళ్ళాడతా..

ఈ సినిమాతోనే బెస్ట్ జోడిగా గుర్తింపు అందుకున్నారు. ఇక వీరి గురించి అప్పట్లోనే చాలా రకాల గాసిప్స్ అయితే వైరల్ అయ్యాయి. ఇక మళ్లీ ఇన్నాళ్లకు ఈ వీరి కలయికలో సినిమా రాబోతోంది అని ఇండస్ట్రీలో మరో టాక్ మొదలయ్యింది. ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి తో నాగార్జున ఒక సినిమా చేయబోతున్నాడు. అయితే అందులో టబు నాగర్జునకు జోడిగా నటించే అవకాశం ఉందట.

ఆర్ఎక్స్ 100 సినిమా తర్వాత మహాసముద్రం సినిమాతో డిజాస్టర్ అందుకున్న ఈ దర్శకుడు ఇప్పుడు మంగళవారం అనే సినిమా చేస్తున్నాడు. ఇక త్వరలోనే నాగార్జున తో కొత్త ప్రాజెక్టును స్టార్ట్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక టబు అయితేనే నాగర్జునకు పర్ఫెక్ట్ గా ఉంటుంది అని సినిమాకు కూడా మంచి క్రేజ్ ఏర్పడుతుంది అని ఫిక్స్ అయ్యారట. మరి ఇది ఎంతవరకు నిజమవుతుందో చూడాలి.

Post a Comment

Previous Post Next Post