కాంతార 2 బడ్జెట్ ఎంతంటే?


రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన కాంతార బాక్సాఫీస్ వద్ద ఈ స్థాయిలో సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 16 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకుంది. అసలు ఈ స్థాయిలో సినిమా సక్సెస్ అవుతుంది అని ఎవరు ఊహించలేదు. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన సీక్వెల్ పై ప్రణాళికలు కొనసాగుతున్నాయి. దర్శకుడు రిషబ్ శెట్టి ఇప్పటికే స్క్రిప్ట్ పనులలో కూడా పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది.

ఇక వీలైనంత త్వరగా సినిమా రెగ్యులర్ షూట్ ను మొదలు పెట్టాలని అనుకుంటున్నారు. ఈసారి మాత్రం మరింత థ్రిల్లింగ్ అనిపించేలా చారిత్రాత్మక కథను దర్శకుడు తెరపైకి తీసుకురాబోతున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా హోంబెల్ ఫిలిమ్స్ భారీ బడ్జెట్ తో నిర్మించేందుకు సిద్ధమైంది. తప్పకుండా 100 కోట్లు దాటుతుంది అని ముందుగానే ఒక హింట్ అయితే ఇచ్చారు. ఇక లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా బడ్జెట్ 130 కోట్ల వరకు అయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

Post a Comment

Previous Post Next Post