ఇండియన్ 2 - గేమ్ చెంజర్.. మళ్ళీ తేడా వచ్చేసింది!


శంకర్ ఊహించని విధంగా తన సినీ జీవితంలో మొదటిసారి ఒకేసారి రెండు సినిమాలను సెట్స్ పైకి తీసుకువచ్చాడు. అనుకోకుండా ఇండియన్ 2 సినిమా ఆగిపోవడంతో వెంటనే గేమ్ ఛేంజర్ ని మొదలు మొదలుపెట్టడం చాలా రకాల ఇబ్బందులను కలిగిస్తోంది. అయితే ఇప్పటివరకు ఏదీ కూడా ప్లాన్ ప్రకారం అయితే జరగలేదు. 

అయితే ఎప్పుడో మొదలు పెట్టిన ఇండియన్ సినిమాను అనుకున్నట్టుగానే వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని అనుకున్నారు. ఇక తర్వాత 2024 మార్చిలో గేమ్ ఛేంజర్ సినిమాను విడుదల చేయాలని ఒక ప్లాన్ సిద్ధం చేసుకున్నారు. కానీ అది ఇప్పుడు సాధ్య పడడం లేదని తెలుస్తోంది. 

ఇప్పుడు గేమ్ చెంజరు ముందుకు రాగా మళ్లీ ఇండియన్ 2 వెనక్కి వెళుతున్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే ఇండియన్ 2 సినిమాకు సంబంధించిన CG వర్క్ చాలా ఆలస్యం అయ్యే అవకాశం ఉందట. అందుకే ఈ సినిమాను 2024 దీపావళికి రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. ఇక సమ్మర్లో గేమ్ ఛేంజర్ సినిమా వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి ఈ విషయంలో చిత్ర యూనిట్ ఎలాంటి క్లారిటీ ఇస్తుందో చూడాలి.

Post a Comment

Previous Post Next Post