ఆగస్టు నుంచి ఎగిరిపోయిన 3 సినిమాలు


మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ తదుపరి యాక్షన్ ఎంటర్‌టైనర్ ఆదికేశవలో కనిపించనున్నాడు. గ్లామరస్ బ్యూటీ శ్రీలీల అందులో కథానాయికగా నటిస్తోంది. ఇక నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ మూవీని మొదట ఆగస్ట్ 18న రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినప్పటికీ షెడ్యూల్ ప్రకారం సినిమా విడుదల కావడం లేదని సమాచారం. నవంబర్‌లో చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ చూస్తున్నారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది.

మరోవైపు స్వీటీ అనుష్క శెట్టి, నవీన్ పొలిశెట్టి నటించిన 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' ఆగస్టు 4న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది, అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో జాప్యం కారణంగా సినిమా వాయిదా పడింది. ఈ చిత్రాన్ని ఆగస్ట్ 18న విడుదల చేయాలని భావించారు, కానీ ఇప్పుడు ఆ అవకాశం లేదని తెలుస్తోంది. మరో డేట్ పై చిత్ర బృందం త్వరలోనే క్లారిటీ ఇవ్వనుంది.  

ఇక దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తన కొత్త చిత్రం 'పెదకాపు'ను ప్రకటించి అందరినీ షాక్‌కు గురిచేశాడు. టైటిల్ కంటే, సినిమా టీజర్ గ్రామీణ కంటెంట్‌తో అందరినీ కదిలించింది. సాధారణంగా ఫ్యామిలీ ఫ్రెండ్లీ సినిమాలతో క్రేజ్ అందుకున్న శ్రీకాంత్ అడ్డాల నుండి ఇలాంటి కంటెంట్ వస్తుందని ఎవరు ఊహించలేదు. వాస్తవానికి ఈ చిత్రాన్ని ఆగస్ట్ 18న విడుదల చేయాలని భావించారు. కానీ అది ఇప్పుడు వాయిదా పడింది. త్వరలోనే ఈ సినిమా డేట్ పై కూడా క్లారిటీ ఇవ్వనున్నారు.

Post a Comment

Previous Post Next Post