5 గంటల బేబీ సినిమా.. ఎలా తగ్గించారంటే?


సాయి రాజేష్ దర్శకత్వంలో వచ్చిన బేబీ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో ప్రాఫిట్ అందిస్తోంది. ఇప్పటివరకు ఈ సినిమా ద్వారా చిత్ర నిర్మాతకు 40 కోట్లకు పైగానే ప్రాఫిట్స్ వచ్చినట్లు సమాచారం. అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత ఎడిటింగ్ రూమ్ లో కూర్చున్న తర్వాత అందరూ కూడా చాలా టెన్షన్ పడిన పరిస్థితి వచ్చిందట.

ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు సాయి రాజేష్ సినిమా రన్ టైం చూసి అందరం కూడా చాలా టెన్షన్ పడ్డామని అన్నారు. ఎందుకంటే మొత్తం ఫస్ట్ కట్ లో ఈ సినిమా 5 గంటల 25 నిమిషాల రన్ టైంతో వచ్చిందట. ఇక తర్వాత దాన్ని తగ్గించడానికి విశ్వ ప్రయత్నాలు చేశామని చెప్పారు. మొదట అనుకున్న ఎడిటర్ కాకుండా మరో ఎడిటర్ రంగంలోకి దిగి నాలుగు గంటలు చేశాడు. 

ఎలా చూసుకున్నా కూడా దాన్ని మూడు గంటల కంటే తక్కువ టైమ్ లోకి తీసుకురాలేకపోయాము. ఇక ఫైనల్ గా దర్శకుడు మారుతి నిర్మాత SKN కూర్చుని సినిమాను తగ్గించుకుంటూ వచ్చారు. ఇక ఫైనల్ గా బన్నీ వాసు ఫైనల్ కట్ చూసి 3 గంటలకంటే తక్కువకు తగ్గించకూడదు అని ఈ ఫైనల్ రష్ పర్ఫెక్ట్ గా సరిపోతుంది అని నమ్మకంగా చెప్పారు. ఇక ఆయన చెప్పిన ఆలోచన విధానం సినిమాకు ఉపయోగపడింది.. అని సాయి రాజేష్ తెలియజేశాడు.

Post a Comment

Previous Post Next Post