బిగ్ బాస్ 7: సీనియర్ హీరో కోసం భారీ పెట్టుబడి


స్టార్ మా బిగ్ బాస్ 7వ సీజన్ సెప్టెంబర్ 7వ తేదీన గ్రాండ్ గా స్టార్ట్ కాబోతోంది. గత ఏడాది భారీ స్థాయిలో డిజాస్టర్ అయిన ఈ రియాలిటీ షో ఈసారి మాత్రం మంచి కంటెంట్ తో టిఆర్పిని పెంచుకోవాలని చూస్తోంది. అయితే కంటెస్టెంట్స్ విషయంలో ఈసారి బిగ్ బాస్ 2 గట్టిగానే ఖర్చు చేస్తున్నట్లు కలుస్తోంది. సీనియర్ యాంకర్లు సీనియర్ హీరోలు కాంట్రవర్సీ యూట్యూబ్లో ఇలా పెద్ద బ్యాచ్ ను రంగంలోకి దింపుతున్నట్లు సమాచారం.

ఇక అందులో ప్రేమదేశం హీరో అబ్బాస్ కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. సినిమాలకు చాలా గ్యాప్ ఇచ్చిన అబ్బాస్ ప్రస్తుతం న్యూజిలాండ్ లో ఉంటున్నాడు. అక్కడే అతను మోటివేషనల్ స్పీచ్ లు ఇచ్చుకుంటూ కొన్ని చిన్న చిన్న బిజినెస్ లతో జీవితాన్ని గడుపుతున్నాడు. అయితే ఇప్పుడు అతన్ని కోసం బిగ్ బాస్ నిర్వాహకులు భారీగానే ఖర్చు పెట్టి రంగంలోకి దింపుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఫైనల్ లిస్ట్ కూడా రెడీ అయినట్లు సమాచారం. జబర్దస్త్ కమెడియన్స్ అలాగే సురేఖవాణి ఆమె కూతురు కూడా వచ్చే అవకాశం ఉందట. మరి ఈ లిస్టు ఎంతవరకు నిజమవుతుందో చూడాలి.

Post a Comment

Previous Post Next Post