ప్రభాస్ - లోకేష్.. కాంబో వెనుక అసలు రీజన్!


ప్రభాస్ లోకేష్ కనగరాజు కాంబినేషన్లో సినిమా రాబోతోంది అని ఈ ఉదయం నుంచి ఇండస్ట్రీలో చాలా రకాల వార్తలు అయితే చక్కర్లు కొడుతున్నాయి. ఇంకా ఈ విషయంలో ఎవరు క్లారిటీ ఇవ్వలేదు కానీ ఈ కాంబినేషన్ ను కలపడానికి మైత్రి మూవీ మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ఒక క్లారిటీ అయితే వస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ ప్రభాస్ తో సినిమా చేయాలి అని గత రెండేళ్ల నుంచి ప్రయత్నాలు చేస్తోంది. ఇక గతంలో అయితే బాలీవుడ్ దర్శకుడు సిద్ధార్థ ఆనంద్ కు మైత్రి సంస్థ కాస్త అడ్వాన్స్ కూడా ఇచ్చి కథను ఫైనల్ చేయమంది. 

అయితే ఆ దర్శకుడు అనుకున్న స్టోరీ లైన్ ప్రభాస్ కు ఎంత మాత్రం నచ్చలేదు. అంతేకాకుండా ఓం రౌత్ కొట్టిన దెబ్బకు ప్రభాస్ ఇప్పట్లో బాలీవుడ్ దర్శకులతో సినిమా చేసేందుకు ఆసక్తిని కూడా చూపించడం లేదు ఈ క్రమంలో మైత్రి మూవీ మేకర్స్ లోకేష్ కనగరాజు తో చర్చలు జరిపి ప్రభాస్ కోసం కథను రెడీ చేయమని ఆఫర్ చేసింది. ఇక ప్రస్తుతం లియో రిలీజ్ పనుల్లో చాలా బిజీగా ఉన్న లోకేష్ ఆ ప్రాజెక్టులో అనంతరం మరోసారి ప్రభాస్ తో కలిసి చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక దసరా అనంతరం ఈ కాంబో పై అధికారికంగా క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.

Post a Comment

Previous Post Next Post