పుష్ప 2: దేవరతో గొడవ లేకుండా ప్లానింగ్!


అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాను దర్శకుడు సుకుమార్ చాలా గ్రాండ్ గా తెరపైకి తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఫస్ట్ పార్ట్ కంటే ఈసారి సెకండ్ పార్ట్ తోనే వెయ్యి కోట్ల బిజినెస్ మార్క్ ను టచ్ చేయాలని బన్నీ నిర్మాతలతో ఇదివరకే చర్చలు కూడా జరిపాడు. అయితే రిలీజ్ డేట్ విషయంలో కూడా చిత్ర యూనిట్ సభ్యులు ఇటీవల ఒక నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. 

పుష్ప 1 విషయంలో పొరపాటు చేసినట్లు ఈసారి ఏమాత్రం రిస్క్ లేకుండా మంచి ప్రమోషన్స్ తో సినిమాపై అంచనాలు క్రియేట్ చేయాలని అనుకుంటున్నారు. అయితే నిర్మాతల ఫోకస్ ఏప్రిల్ పైనే పడింది. అప్పుడు విడుదల చేస్తే పక్కా సమ్మర్ హాలిడేస్ బాగా హెల్ప్ అవుతాయని అనుకుంటున్నారు. అయితే ఏప్రిల్ 5వ తేదీన దేవర రాబోతున్నాడు. ఆ సినిమాపై కూడా అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఇక పుష్ప 2 మాత్రం ఎన్టీఆర్ దేవర తో క్లాష్ అవ్వకుండా రెండు వారాలు గ్యాప్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే విడుదల తేదీపై అధికారికంగా క్లారిటీ రానున్నట్లు సమాచారం.

Post a Comment

Previous Post Next Post