త్రివిక్రమ్ పై కూడా పొలిటికల్ సేగలు!


పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా అగ్రేసివ్ గా ముందుకు వెళుతూ ఉండడంతో బిగ్ టార్గెట్ గా మారిపోయాడు అని అందరికీ తెలిసిన విషయమే. ఇక వీలైనంతవరకు తన కుటుంబ సభ్యులను రాజకీయాలకు దూరంగా ఉంచేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే పవన్ కళ్యాణ్ కు చాలా దగ్గర మిత్రుడైన త్రివిక్రమ్ మాత్రం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.  

వైసిపి నాయకుడు మంత్రి అయినటువంటి అంబటి రాంబాబు బ్రో సినిమాలో తనపై సెటైర్ సీన్స్ హైలైట్ చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతేకాకుండా ఇప్పుడు పవన్ పై మళ్లీ టార్గెట్ డోస్ పెంచినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ తరుణంలో త్రివిక్రమ్ పై కూడా ఆయన హెచ్చరికలు చేయడం ఆశ్చర్యాన్ని కలిగించింది. దాదాపు ఇండస్ట్రీ లో ఉన్న అందరికీ కూడా హెచ్చరికలు చేసినట్లుగా అంబటి మాట్లాడాడు.

అయితే ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ క్లోజ్ ఫ్రెండ్ అయినటువంటి త్రివిక్రమ్ పై కూడా ఆయన గట్టిగానే హెచ్చరికలు చేశాడు. అనవసరంగా సినిమాల్లో ఇలాంటి రాతలు రాస్తే ఊరుకునేది లేదని అన్నారు. సాధారణంగా టాలీవుడ్ సినిమాలకు ఆంధ్రప్రదేశ్లో ఊహించని విధంగా అప్పుడప్పుడు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. ఇక ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ క్లోజ్ ఫ్రెండ్ త్రివిక్రమ్ పై కూడా రాబోయే రోజుల్లో మరింత ఫోకస్ పెంచకుండా ఉండరు అని అర్థమవుతుంది. ఇక ఆ ప్రభావం అటు ఇటు తిరిగి 'గుంటూరు కారం' సినిమా మీద పడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

Post a Comment

Previous Post Next Post