మెహర్ రమేష్.. నెక్స్ట్ ప్రాజెక్ట్ అసలు ఉంటుందా?


మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ రిజల్ట్ చూసిన తర్వాత ఏ హీరో కూడా మళ్లీ రమేష్ తో సినిమా అంటే అంత సాహసం చేయరేమో. ఈ రోజుల్లో ప్లాప్స్ అనేది ఎవరికైనా చాలా కామన్. కానీ ఎంతో కొంత డిఫరెంట్ గా ట్రై చేసి ఫ్లాప్ అందుకుంటే అది వేరే లెక్క. కానీ ఒక రీమేక్ సినిమాతో అది కూడా రెగ్యులర్ కమర్షియల్ సినిమాతో డిజాస్టర్ అందుకుంటే మాత్రం ఏ హీరో కూడా ఆ దర్శకుడుతో సినిమా చేయడానికి ఆసక్తి చూపించడు. 

ఈ రీమేక్ లాంటివి కాకుండా దర్శకుడు రమేష్ ఏదైనా ప్రయోగత్మకమైన కథలను సెలెక్ట్ చేసుకుని వచ్చి ఉంటే చాలా బాగుండేది. ఇక ఇప్పుడు ఈ దర్శకుడు తదుపరి ప్రాజెక్టు స్టేట్స్ పైకి వస్తుందా లేదా అనేది మరో పెద్ద మిస్టరీ. ఎందుకంటే భోళా శంకర్ షూటింగ్ దశలోనే అతను ఒక లేడీ ఓరియంటెడ్ సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడు అది కూడా తమన్నా కీలకపాత్రలోనే అని ఇటీవల ఇంటర్వ్యూలలో కూడా చెప్పేసాడు ఇక తమన్నా కూడా భోళా శంకర్ తో మరింత దారుణంగా డిజాస్టర్ ఎదుర్కొంది. మరి ఇలాంటి ప్రభావంతో మెహర్ రమేష్ ను ఏ నిర్మాత నమ్ముతాడో చూడాలి.

Post a Comment

Previous Post Next Post