భోళా శంకర్ మూవీ - రివ్యూ & రేటింగ్


కథ:
శంకర్ (చిరంజీవి) తన సోదరి మహా (కీర్తి సురేష్) చదువు కారణంగా కోల్‌కతాకు వస్తాడు.  ఆమెను కాలేజీలో చేర్పించిన తర్వాత, జీవనోపాధి కోసం శంకర్ టాక్సీ డ్రైవర్‌గా చేరతాడు. ఇక అక్కడ మహిళల అక్రమ రవాణా నేరాలలో కలకత్తా పోలీసులు టాక్సీ డ్రైవర్ల సహాయాన్ని కోరగా శంకర్ ఒక కీలకమైన క్లూ ఇస్తాడు. దీంతో అతను ఇబ్బందుల్లో పడతాడు. ఇక మరోవైపు చెల్లి ప్రేమ వ్యవహారం పలు రకాల మలుపులు తిరుగుతుంది. లస్య(తమన్నా) ఒక లాయర్ గా శంకర్ బ్యాక్ గ్రౌండ్ గురించి తెలుసుకున్న తరువాత కఠిన నిర్ణయం తీసుకుకుటుంది. అనంతరం శంకర్ తన గతాన్ని మరియు కోల్‌కతాకు రావడం వెనుక తన ఉద్దేశ్యాన్ని వెల్లడించాడు. ఇక మహిళల అక్రమ రవాణాతో కూడిన క్రైమ్ నెట్‌వర్క్‌ను అతను ఎలా ఎదిరించాడు, పలు సమస్యలను ఎలా సెటిల్ చేశాడు అనేది సినిమా అసలు కథ.

విశ్లేషణ:
2015లో వచ్చిన వేదళం రీమేక్ అప్పటికే చాలా రొటీన్ స్టోరీ అనే ముద్రను వేసుకుంది. అజిత్ ఫ్యాన్స్ జోరుకు కొన్ని సీన్స్ వలన బాగానే ఆడేసింది. ఇక అలాంటి కథను రీమేక్ చేయాలని ఎవరు అనుకోరు. ఇక తక్కువ రేటులో రీమేక్ హక్కులకు ఆశపడ్డారో.. మరేంటో గాని నిర్మాత అనిల్ సుంకర ఆ సినిమాను రీమేక్ చేయాలని అనుకోవడం అతిపెద్ద రిస్క్. ఇక శక్తి షాడో లాంటి డిజాస్టర్స్ తీసిన మెహర్ రమేష్ చేతిలో పెట్టడం మరో పెద్ద రిస్క్. 

కానీ రీమేక్ సినిమాలను తెరపైకి తీసుకురావడంలో మెహర్ రమేష్ కు మంచి పట్టు ఉంది అని మెగాస్టార్ కూడా సపోర్ట్ చేసి మరి భోళా శంకర్ ను నమ్మారు. ఇక విడుదలకు ముందే ఈ సినిమా పాటలతో పెద్దగా హైప్ క్రియేట్ చేయలేదు. అయినప్పటికీ మెగాస్టార్ తన స్టైల్ తో ఆకట్టుకుంటారు అని ఫ్యాన్స్ కొంత నమ్మకంతో అయితే కనిపించారు. ప్రమోషన్స్ హడావిడి కూడా బాగానే చేశారు. 

ఇక సినిమా వివరాల్లోకి వెళితే అసలు మొదటి కథ రెగ్యులర్ ఫార్మాట్లోనే మొదలై చివరి వరకు అదే తరహా ఫిల్ ను అయితే కలిగిస్తుంది. ఒక టాక్సీ డ్రైవర్ గా మెగాస్టార్ చాలా స్టైలిష్ గా కనిపించారు. దర్శకుడు ఒరిజినల్ కథకు తగ్గట్టుగా కాకుండా కొన్ని మార్పులు అయితే చేసాడు కానీ అవి ఏమంత కిక్ అయితే తీసుకురావు. వెండితెరపై ఏదో రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్లో వెళుతున్న సినిమా గానే అనిపిస్తుంది. కథలో విలన్స్ పాత్రలు ఆ తరువాత కమెడియన్ పాత్రలు తర్వాత సాధారణ క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇలా అందరూ ఒకరి తర్వాత ఒకరు హడావిడి చేసినట్టు కనిపిస్తారు. కానీ కథనంలో పట్టు లేకపోవడంతో చాలా నీరసాన్ని తెప్పిస్తాయి.

ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా సినిమాలో ఏదైనా మెచ్చుకోదగిన అంశం పెద్దగా ఉంది అంటే వెన్నెల కిషోర్ పాత్ర గురించి చెప్పుకోవచ్చు. ఇక మిగతా ఆర్టిస్టులు అందరూ కూడా ఎప్పటిలానే రొటీన్ పాత్రలలోనే కనిపించారు. మాఫియా కు సంబంధించిన కథాంశాలు కూడా అంతగా కొత్తగా ఏమీ అనిపించవు. హీరో ఒకదాని తర్వాత ఒక సమస్యను దాటుకుంటూ వెళుతుండగా ప్రేక్షకులు ముందే ఆ సన్నివేశాలను ఊహించే విధంగానే ఉంటాయి. యాక్షన్ ఎలిమెంట్స్ లో మాత్రం దర్శకుడు రమేష్ మెగాస్టార్ ను ఎంతో కొత్తగా చూపించాలని ప్రయత్నాలు చేసినప్పటికీ అవి ఏమి అంతగా క్లిక్ అయితే కాలేదు. కేవలం మెగాస్టార్ స్టైల్ అక్కడక్కడ ఏదో స్టైలిష్ గా హైలెట్ చేసినట్లు అనిపించింది. కానీ కథనంలో పట్టు లేకపోవడంతో ఆ మెరుపులు కూడా ఆడియన్స్ పెద్దగా గుర్తించుకునే అవకాశం కూడా ఉండదు. 

సినిమా కథను ఎలా కొనసాగిస్తున్న కూడా హీరో పాత్రకు ధీటుగా విలన్ పాత్రలు ఉంటేనే హీరోఇజం హై లెవెల్లో ఎలివేట్ అవుతుంది. కానీ భోళా శంకర్ సినిమాలో విలన్ పాత్రలు గట్టిగా అరవడమే తప్పితే అందులో పస మాత్రం కనిపించదు. దీంతో అక్కడే సినిమా సగం తేడా కొట్టేసింది. ఇక సెకండాఫ్ లో కీర్తి సురేష్ చెల్లెలి పాత్రలో కాస్త హైలెట్ అయింది కానీ అది కూడా ఎక్కువసేపు ఏమీ ఉండదు. అక్కడక్కడ కొన్ని పాత్రలు మాత్రమే పర్వాలేదు అనిపించాయి. 

ఇక సుశాంత్ క్యారెక్టర్ అయితే చాలా సింపుల్ గానే ఉంది. అతని సీన్స్ వలన సినిమాలో అతన్ని ఆడియన్స్ పెద్దగా గుర్తించుకునే అవకాశాలు లేవు. ఇక తమన్నా సీన్స్ పరమ రొటీన్. ఆమె క్యారెక్టర్ డిజైనింగ్ చాలా దారుణంగా ఉంది. చాలా సన్నివేశాల్లో ఆమె టైమింగ్ తేడా కొట్టేసింది. ఇక పవన్ ను ఇమిటేట్ చేయాలని మెగాస్టార్ చేసిన సీన్స్ కూడా అంతగా హైలెట్ కాలేదు. శ్రీముఖి ఖుషి సీన్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.
 మ్యూజిక్ పరంగా చెప్పుకోవాలంటే మహతి స్వర సాగర్ ఈ సినిమాకు ఏమంతగా ఉపయోగపడలేదు. ముందే పాటలు క్లిక్ కాలేదు. ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా చాలా రెగ్యులర్ గానే ఉంది. ఇక కెమెరామెన్ పనితనం అక్కడక్కడ పరవాలేదు అనిపించింది. మొత్తంగా భోళా సినిమా పాత ప్రోటీన్ కమర్షియల్ మాస్ ఎలిమెంట్స్ తో వెండితెర పైకి వచ్చింది. ఇక్కడ ఫ్యాన్స్ కు కూడా అంతగా విజిల్స్ వేసే సీన్స్ అయితే ఏమి కనిపించవు. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 90 కోట్ల టార్గెట్ ను ఎలా అందుకుంటుందో చూడాలి.

ప్లస్ పాయింట్స్:
👉మెగాస్టార్ 

మైనస్ పాయింట్స్:
👉రెగ్యులర్ సీన్స్
👉తమన్నా
👉మ్యూజిక్
👉ఫస్ట్ హాఫ్

రేటింగ్: 2/5

Post a Comment

Previous Post Next Post