సంక్రాంతి సినిమాలు.. షూట్స్ ఎంత వరకు వచ్చాయంటే?


2024 సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద కొన్ని డిఫరెంట్ సినిమాలు సందడి చేయబోతున్నాయి. అయితే అందులో కొన్ని సినిమాలు అనుకున్న సమయానికే రాబోతుండగా మరికొన్ని మాత్రం వాయిదా పడే అవకాశం ఉంది. ఇక లేటెస్ట్ ప్లాన్ ప్రకారం అయితే కొన్ని సినిమాల షూటింగ్స్ చాలా బ్యాలెన్స్ అయితే ఉన్నాయి. ఇక ఏ సినిమా షూటింగ్ ఎంతవరకు వచ్చింది అనే వివరాల్లోకి వెళితే.. 

ముందుగా గుంటూరు కారం సినిమా షూటింగ్ అయితే కేవలం 25% మాత్రమే ఫినిష్ అయింది. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ 20% షూట్ మాత్రమే పూర్తయ్యింది. రవితేజ ఈగల్ 60%, ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా వస్తున్న హనుమాన్ 90% షూటింగ్ ఫినిష్ అయ్యింది. ఇక విజయ దేవరకొండ - పరశురామ్ కాంబోలో రానున్న VD13 సినిమా షూటింగ్ 20% మాత్రమే ఫినిష్ అయ్యింది. ఈ లిస్టులో హనుమాన్, ఈగల్ తప్పకుండా వచ్చే ఛాన్స్ ఉంది. ఇక ఉస్తాద్, గుంటూరు కారం రెండింటిలో ఒకటి మాత్రమే వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Post a Comment

Previous Post Next Post