బేబీ.. మరికొన్ని బోల్డ్ సీన్స్ కూడా..


సాయి రాజేష్ దర్శకత్వంలో వచ్చిన బేబీ సినిమా బాక్సాఫీస్ వద్ద నిర్మాతలకు మంచి లాభాలను అందిస్తోంది. ఈ సినిమాపై పెట్టిన పెట్టుబడి కంటే ఎక్కువగా మరో 50 కోట్ల ప్రాఫిట్స్ కూడా వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమా రన్ టైమ్ మొదట అనుకున్నప్పుడు దాదాపు 5 గంటలకు పైగానే వచ్చిందట. ఇక తర్వాత ఎంతో కష్టపడి దాన్ని నాలుగు గంటలకు సెట్ చేశారు. 

ఇక తర్వాత మరికొన్ని రోజులు నానా తంటాలు పడి 3 గంటల నిడివి కి తీసుకు వచ్చినట్లుగా దర్శకుడు సాయి రాజేష్ ఇదివరకే తెలియజేశాడు. అయితే ఇప్పుడు ఎడిటింగ్ లో తీసేసిన కొన్ని సీన్స్ ను మళ్లీ యాడ్ చేయాలని చూస్తున్నారు. ఇప్పటికే బేబీ సినిమా ధియేటర్లలో మూడు గంటలు నిడివితో కొనసాగుతోంది. అయితే ఇప్పుడు దానికి మరికొన్ని సీన్స్ యాడ్ చేయాలి అని అనుకుంటున్నారు. 

అందులో ముఖ్యంగా వైష్ణవి చైతన్య విరాజ్ అశ్విన్ మధ్యలో ఉండే కొన్ని బోల్డ్ సీన్స్ కూడా కలపబోతున్నారట. అంతేకాకుండా ఆనంద్ దేవరకొండ మదర్ సెంటిమెంట్ కు సంబంధించిన సీన్స్ కూడా మిక్స్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే థియేటర్లలో ఓటీటీ లో ఈ తరహా సీన్జ్ యాడ్ చేస్తే బెటర్ అని అల్లు అరవింద్ వారికి సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది.

Post a Comment

Previous Post Next Post