రజినీకాంత్ జైలర్ సినిమాత ఈసారి తప్పనిసరిగా సక్సెస్ కొట్టాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా తెలుగులో కూడా రజినీకాంత్ కు సక్సెస్ లేక చాలా కాలం అవుతోంది. రోబో తరువాత చేసిన కబాలి పరవాలేదు అనిపించింది కానీ ఆ తరువాత ఏ సినిమా కూడా పెట్టిన పెట్టుబడులు వెనక్కి తేలేక పోయింది.
ఇక కొన్నేళ్లుగా తెలుగులో రజినీకాంత్ థియేట్రికల్ బిజినెస్ చూస్తే.. 2.ఓ 80 కోట్ల రేంజ్ లో అమ్ముడు పోగా పేట దాదాపు 14 కోట్లకు అమ్ముడైంది. ఇక దర్బార్ 15 కోట్ల రేంజ్ లో ధర పలుకగా.. అన్నత్తై 12 కోట్ల రేంజ్ లో బిజినెస్ చేసింది. ఇక ఇప్పుడు జైలర్ కూడా దాదాపు అదే రేంజ్ లో 12 కోట్లకు థియేట్రికల్ హక్కులు అమ్ముడైనట్లు సమాచారం. తెలుగులో మార్కెట్ ను గమనిస్తే సినిమా సినిమాకు తగ్గుతూ వస్తోంది. చివరి 5 డినిమాలలో ఏది కూడా తెలుగులో బ్రేక్ ఈవెన్ చేయలేదు. మరి జైలర్ ఏమవుతుందో చూడాలి.
Follow
Post a Comment