కూతురుని రిస్క్ లో పెట్టలేకపోతున్న చిరు


మెగాస్టార్ చిరంజీవి తన పుట్టినరోజు సందర్భంగా ఒకేసారి రెండు సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ అయితే ఇవ్వాలని అనుకున్నారు. భోళాశంకర్ సినిమా దారుణంగా డిజాస్టర్ కావడంతో కాస్త గ్యాప్ తీసుకోవాలని డిసైడ్ అయిన మెగాస్టార్ ముఖ్యంగా కథల విషయంలో అయితే ఏ మాత్రం తొందరపడకూడదు అని కూడా ఆలోచిస్తున్నారు.

ఇక తన 157వ సినిమాను యువి క్రియేషన్స్ లో వశిష్ట దర్శకత్వంలో చేయబోతున్నట్లు ఒక పోస్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. అయితే అంతకుముందే 156వ సినిమా విషయంలో కూడా మెగాస్టార్ చిరంజీవి తొందరగా అప్డేట్ ఇవ్వాలని అనుకున్నారు. తన పెద్ద కూతురు సుస్మిత కొణిదెల ప్రొడక్షన్లో మెగాస్టార్ చిరంజీవి నెక్స్ట్ సినిమా చేయాల్సి ఉంది. బ్రో డాడి రీమేక్ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో చేయాలని అనుకున్నారు.

కానీ రీమేక్ అంటేనే మెగాస్టార్ సిద్ధంగా లేరు. అయితే కళ్యాణ్ కృష్ణ మళ్ళీ ఇప్పుడు కొత్త తరహా కథ కోసం వెతుకుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక మెగాస్టార్ చిరంజీవి కూతురుని రిస్క్ లో పెట్టలేకనే సినిమా అఫీషియల్ అప్డేట్ లో కూడా కళ్యాణ్ కృష్ణ పేరు వేయలేదు. ఆ దర్శకుడు వీలైనంత తొందరగా మంచి కథ ఇస్తేనే నెక్స్ట్ 156వ సినిమా బ్యానర్లో అతని పేరు పడుతుంది. ఇక ఒకవేళ కళ్యాణ్ కృష్ణ మెప్పించ లేకపోతే మాత్రం మెగాస్టార్ చిరంజీవి వశిష్ట సినిమాను మొదట ఫినిష్ చేసే అవకాశం అయితే ఉంది.

Post a Comment

Previous Post Next Post