మైత్రి మూవీ మేకర్స్.. అవార్డులతో మరింత ఖుషి


టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు బిగ్గెస్ట్ భారీ బడ్జెట్ సినిమాలను నిర్మిస్తున్న సంస్థల్లో మైత్రి మూవీ మేకర్ టాప్ లిస్టులో ఉంటుంది అని చెప్పవచ్చు. ఇక ఈ సంస్థ ఈ ఏడాది మొదట్లోనే వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి.. రెండు సినిమాలతో కూడా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఇక ప్రస్తుతం పుష్ప 2 చిత్రాన్ని కూడా భారీ బడ్జెట్లోనే తెరపై తీసుకురాబోతున్నారు. 

ఇక వచ్చేవారం ఖుషి సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే విడుదల కాబోతోంది. చేతిలో ఎన్టీఆర్ ప్రశాంత్ నిల్ కాంబినేషన్ కూడా ఉంది. ఇక హ్యాపీగా కొనసాగుతున్న టైంలోనే చిత్ర నిర్మాణ సంస్థకు నేషనల్ అవార్డ్స్ తో మరింత బూస్ట్ లభించింది అని చెప్పాలి. పుష్ప పార్ట్ వన్ సినిమాకు గాను అల్లు అర్జున్ బెస్ట్ యాక్టర్ గా గుర్తింపు అందుకోగా అదే సినిమాకు గాను దేవిశ్రీప్రసాద్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంపిక అయ్యాడు. ఇక ఉప్పెన సినిమాకు ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా మరొక అవార్డును సొంతం చేసుకోవడం మైత్రి మూవీ మేకర్స్ కు మరింత ఆనందాన్ని ఇచ్చింది. ఈ ఆనందంతో రానున్న ఖుషి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాలను అందుకుంటుందో చూడాలి.

Post a Comment

Previous Post Next Post