గన్నులతో దేవరకొండ బీభత్సం.. గోలిమార్ కాదు కదా?


ఇప్పటివరకు విజయ్ దేవరకొండ చేసిన సినిమాలు ఒక లెక్క రాబోయే సినిమాలు మరొక లెక్క అనే విధంగా ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. ఖుషి సినిమా అయితే రెగ్యులర్ రొమాంటిక్ ఫ్యామిలీ కామెడీగా ఉండబోతున్నట్లు అర్థమవుతుంది. అయితే ఆ తర్వాత వచ్చే 12వ సినిమా మాత్రం విజయ్ దేవరకొండ కెరీర్ లోనే ఒక సరికొత్త తరహాలో ఉండబోతున్నట్లు అర్థమవుతుంది.

ఇప్పటివరకు విజయ్ దేవరకొండ బెస్ట్ యాక్షన్ అయితే బయట పెట్టలేదు. ఇక 12వ సినిమాలో మాత్రం అతను గన్నులతో బీభత్సం సృష్టించడానికి రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది. గౌతమ్ తిన్నానూరి దర్శకత్వంలో విజయ్ చేయబోతున్న ఆ సినిమాలో ఒక గ్యాంగ్ స్టర్ మాఫియా నేపథ్యంలో రాబోతుందట. ఇక సినిమాలో గన్నులతో విజయ్ దేవరకొండ చేసే హడావిడి మామూలుగా ఉండదని తెలుస్తోంది. ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలోనే కాకుండా గ్యాంగ్ స్టర్ గా కూడా విజయ్ అందులో సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నట్లు సమాచారం. గతంలో ఇదే లైన్ లో పూరి జగన్నాథ్ గోలీమార్ సినిమా కూడా ఇదే పాయింట్ లో వచ్చింది. మరి విజయ్ దేవరకొండ తో గౌతం తిన్ననూరి ఎలాంటి కంటెంట్ ను హైలెట్ చేస్తాడో చూడాలి.

Post a Comment

Previous Post Next Post