దేవర.. గ్రాఫిక్స్ కోసమే అంత బడ్జెట్టా..


జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఆచార్య సినిమా డిజాస్టర్ అందుకున్నప్పటికీ కూడా దర్శకుడు కొరటాల శివ ఈ సినిమా మేకింగ్ విషయంలో అసలు ఏమాత్రం తగ్గడం లేదు. నిర్మాతలు కూడా భారీ స్థాయిలోనే ఈ సినిమా కోసం ఖర్చు పెడుతున్నారు. మొదట అనుకున్న బడ్జెట్ అయితే దాదాపు 250 కోట్లు.

ఇక ఆ లోపే సినిమాను పూర్తి చేయాలి అని దర్శకుడు ఫిక్స్ అయ్యాడు. అయితే ఈ సినిమా గ్రాఫిక్స్ విషయంలో మాత్రం రాజీ లేకుండా ఖర్చు పెట్టడానికి కూడా కళ్యాణ్ రామ్ ప్రొడక్షన్ టీమ్ గట్టిగానే డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. కేవలం గ్రాఫిక్స్ కోసమే దాదాపు 100 కోట్ల నుంచి 120 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నట్లు సమాచారం. గ్రాఫిక్స్ విషయంలో అసలు ఏమాత్రం తేడా రాకుండా హాలీవుడ్ టెక్నీషియన్స్ తోనే వర్క్ చేస్తున్నారు. మరి సినిమా మేకింగ్ విధానం వెండితెరపై ఎలా ప్రజెంట్ అవుతుందో చూడాలి.

Post a Comment

Previous Post Next Post