బంగార్రాజు దర్శకుడితో కూడా రిస్కే..?


మెగాస్టార్ మెహర్ రమేష్ దర్శకత్వంలో చేసిన భోళా శంకర్ సినిమా డిజాస్టర్ కావడంతో ఇప్పుడు ఆయన రీమేక్ చేసే ఆలోచనలో అయితే లేడు. ఇంతకుముందు అనుకున్నా బ్రో డాడీ రీమేక్ ఆలోచనలను కూడా క్యాన్సల్ చేసుకున్నారు. దీంతో దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ప్రస్తుతం మరొక కథపై కసరతులు చేస్తున్నాడు. అయితే గతంలో మెహర్ రమేష్ కు ఎలాగైతే మాట ఇచ్చి మెగాస్టార్ అవకాశం ఇచ్చారో, ఇప్పుడు కళ్యాణ్ కృష్ణకు కూడా ఛాన్స్ ఇస్తున్నారు. 

అయితే ఈ దర్శకుడు కూడా ఇప్పటివరకు తన కెరీర్లో పెద్దగా గుర్తుండిపోయే ప్రయోగాత్మకమైన సినిమాలు ఏమీ చేయలేదు. మొదట వచ్చిన సోగ్గాడే చిన్నినాయన కమర్షియల్ గా సక్సెస్ అయింది. అందులో కమర్షియల్ ఎలిమెంట్స్ చాలా ఎక్కువగానే ఉన్నాయి. అదే ఫార్మాట్ లో వచ్చిన సీక్వెల్ బంగార్రాజు బెడిసికొట్టింది.

రెండవ సినిమా రారండోయ్ వేడుక చూద్దాం సినిమా కూడా దాదాపు రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్లోనే వచ్చింది. అయితే ఈ ఫార్మాట్లో ఒక రెండు మూడు సినిమాల వరకు హ్యాపీగా సక్సెస్ లో అందుకున్న అగ్ర దర్శకులు కూడా కోలుకోలేని దెబ్బ తిన్నారు. ముఖ్యంగా కొరటాల శివ ఆచార్య తో ఎలాంటి షాక్ ఎదుర్కొన్నాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ఇక కళ్యాణ్ కృష్ణ కూడా రవితేజతో చేసిన నేల టిక్కెట్టు కూడా అంతే దారుణంగా దెబ్బ కొట్టింది. ఇక తర్వాత వచ్చిన బంగార్రాజు సినిమా కూడా అంతగా సక్సెస్ అయితే కాలేదు. ఇక ఇలాంటి రెగ్యులర్ కమర్షియల్ దర్శకుడు మెగాస్టార్ చిరంజీవితో చేసిన కూడా అందులో కమర్షియల్ పాయింట్స్ ఉంటాయని అనిపిస్తోంది. ప్రస్తుతం కమల్ హాసన్ రజినీకాంత్ ఎలాగైతే కొత్త తరహాలో డిఫరెంట్ కథలను చేస్తున్నారో మెగాస్టార్ కూడా అదే తరహాలో ఆలోచిస్తే బెటర్ అని ఆడియన్స్ చెబుతున్నారు.

Post a Comment

Previous Post Next Post