ఎన్టీఆర్ తో సుక్కు.. ఎలా సాధ్యం?


జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా పూర్తయిన తరువాత ఎవరితో వర్క్ చేస్తారు అనే విషయంలో కాస్త కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతోంది. ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ ఓకే అయ్యింది కానీ అది స్టార్ట్ కావడాని కంటే ముందే వార్ 2 లో విలన్ గా నటిస్తాడాని అంటున్నారు. ఇంకా ఆ విషయంలో కూడా అధికారికంగా ఎలాంటి క్లారిటీ రాలేదు. అయితే ఇప్పుడు మరో టాలీవుడ్ దర్శకుడితో ఎన్టీఆర్ చర్చలు జరుపుతున్నట్లు టాక్ వస్తోంది.

సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్ లో ఎన్టీఆర్ మూవీ చేసే అవకాశం ఉందట. ఇంతకుముందు నాన్నకు ప్రేమతో సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న ఈ కాంబో ఆ తరువాత మరోసారి కలవాలని అనుకున్నప్పటికి కుదరలేదు. ఇక ఇప్పుడు మరో కథను తారక్ కు సెట్టయ్యేలా సుక్కు రెడీ చేస్తున్నట్లు సమాచారం. అయితే సుకుమార్ పుష్ప 2 అనంతరం రామ్ చరణ్ తో సినిమా చేయాల్సి ఉంది. అలాగే విజయ్ తో అప్పట్లో ర్యాంపేజ్ అంటూ సినిమా చేయనున్నట్లు ఎనౌన్స్ చేశారు. ఇక సుక్కు ఒక్క సినిమాకే రాజమౌళి రేంజ్ లో టైమ్ తీసుకుంటూ ఉన్నాడు. మరి ఎన్టీఆర్ తో ఎప్పుడు చేస్తారో చూడాలి.

Post a Comment

Previous Post Next Post