బింబిసార దర్శకుడిని మరింత దూరం పెట్టిన హీరో?


గతేడాది విడుదలైన బింబిసార నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్. రీసెంట్ గా ఈ సినిమా మొదటి వార్షికోత్సవాన్ని పూర్తి చేసుకుంది. ఇక కళ్యాణ్ రామ్‌తో పాటు ప్రాజెక్ట్‌లో పాలుపంచుకున్న వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ దర్శకుడు వశిష్ట ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ చేశాడు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే కళ్యాణ్ రామ్ వార్షికోత్సవం గురించి ఎటువంటి పోస్ట్ చేయలేదు. వశిష్ట పోస్ట్‌పై కూడా స్పందించలేదు.

ఇక కళ్యాణ్ రామ్ ఆ రోజు ఉదయం డెవిల్ విడుదల తేదీ పోస్టర్‌ను పోస్ట్ చేశాడు. దీంతో కళ్యాణ్ రామ్, వశిష్ట మధ్య గొడవలు జరుగుతున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. టాక్ ప్రకారం ZEE సంస్థ బింబిసార 2 సినిమా హక్కుల కోసం దాదాపు 100 కోట్ల ఆఫర్ ఇచ్చింది. దీంతో రెండో భాగాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కళ్యాణ్ రామ్ భావిస్తున్నాడు. అయితే వశిష్టకు మెగాస్టార్ చిరంజీవి ఒక సబ్జెక్ట్‌ పై గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో దర్శకుడు ఆసక్తి చూపడం లేదు. ప్రస్తుతం రొమాంటిక్ డైరెక్టర్, బింబిసార VFX సూపర్‌వైజర్ అనిల్ పాదూరి రెండవ భాగాన్ని తీర్సకెక్కించే అవకాశం ఉన్నట్లు పుకార్లు వస్తున్నాయి. ఇక వశిష్ట తన రెండో ప్రాజెక్ట్ ఎన్టీఆర్ ఆర్ట్స్‌తో కలిసి పనిచేయడానికి ముందే ఒప్పందం చేసుకున్నాడు. మరి ఆ ఒప్పందం విషయంలో చిరంజీవి సినిమాకి వెళ్లే ముందు పరిష్కరించుకోవాలి.

Post a Comment

Previous Post Next Post