ప్రభాస్ తరువాత చిరు కోసమే భారీ బడ్జెట్?


ప్రభాస్ క్లోజ్ ఫ్రెండ్స్ స్థాపించిన UV క్రియేషన్స్ తో ఇప్పటివరకు బిగ్ బడ్జెట్ సినిమాలను కేవలం డార్లింగ్ తోనే చేశారు. మిర్చి, సాహో, రాధే శ్యామ్ మూడు సినిమాల నిర్మాణంలో వీరి పాత్ర బలంగానే ఉంది. ప్రభాస్ పైనే భారీగా పెట్టుబడులు పెట్టి సంస్థ ఆదాయాన్ని పెంచుకున్నారు. అలాగే మిగతా కొంతమంది మీడియం రేంజ్ హీరోలపై అలాగే చిన్న హీరోలపై కూడా 50 కోట్లలో పెట్టుబడులు పెట్టి మంచి ఆదాయాన్ని సొంతం చేసుకున్నారు. 

కానీ ఇప్పుడు ప్రభాస్ తరువాత అత్యధిక స్థాయిలో మెగాస్టార్ చిరంజీవి పై భారీ బడ్జెట్ పెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. మెగాస్టార్ 157వ ప్రాజెక్టు పై ఇటీవల అధికారికంగా క్లారిటీ ఇచ్చేశారు. వశిష్ట దర్శకత్వంలో సోషియో ఫాంటసీ ఫిలిం గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ సినిమా కోసం దాదాపు 120 కోట్లకు పైగానే ఖర్చు చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక అలాగే ఈ సినిమా ద్వారా దర్శకుడు వశిష్ట కూడా దాదాపు 10 కోట్ల రేంజ్ లోనే రెమ్యునరేషన్ అందుకోబోతున్నట్లు సమాచారం. ఇక త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మిగతా ఆర్టిస్టుల వివరాలను కూడా అధికారికంగా తెలియజేయనున్నారు.

Post a Comment

Previous Post Next Post