రజినీకాంత్ సినిమా.. నాని రేటు ఎంతంటే?


నాచురల్ స్టార్ నాని రజినీకాంత్ సినిమాలో ఛాన్స్ అందుకున్నట్లుగా గత కొన్ని రోజులుగా మీడియాలో అనేక రకాల కథనాలు అయితే వెలువడుతున్నాయి. అయితే ఈ సినిమా కోసం నాని ఊహించని స్థాయిలో పారితోషకమైతే అడుగుతున్నట్లుగా కూడా ఒక టాక్ అయితే ఇప్పుడు వైరల్ అవుతుంది. సాధారణంగా నాని ఒక సినిమాకు మినిమం 10 కోట్ల రేంజ్ లో అయితే రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. 

ఇక దసరా పాన్ ఇండియా కాబట్టి దాని కోసం అతను 12 కోట్ల రేంజ్ లో అయితే ఛార్జ్ చేశాడు. అయితే ఇప్పుడు రజినీకాంత్ 170 సినిమాలో ఒక స్పెషల్ పాత్రలో నటించే అవకాశం వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక అందుకోసం అతను దాదాపు 8 కోట్ల స్థాయిలోనే రెమ్యునరేషన్ అడుగుతున్నట్లు సమాచారం ఈ సినిమా రెండు భాషల్లో విడుదలవుతుంది కాబట్టి మంచి బిజినెస్ జరిగే అవకాశం అయితే ఉంది. ఇక నాని అడిగిన నెంబర్ కు మరి నిర్మాతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Post a Comment

Previous Post Next Post