మారుతి ట్రాక్ లో ప్రభాస్!


ఆదిపురుష్ విడుదల కాగానే ప్రభాస్ ప్రమోషన్ కూడా చేయకుండా USA కు వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఇక పొడిగించిన సెలవును ముగించిన తరువాత, ప్రభాస్ విడుదలకు సిద్ధమవుతున్న ప్రాజెక్ట్ K వంటి కొన్ని చిత్రాల షూటింగ్‌లో జాయిన్ అవ్వాల్సి ఉంది. అదే సమయంలో, ప్రభాస్ కూడా సలార్ ప్రమోషన్స్ ప్రారంభించాలి. అయితే ఆశ్చర్యకరంగా ఈ స్టార్ హీరో ఇప్పుడు మారుతీ చిత్రం రాజా డీలక్స్ సెట్స్‌లో చేరడానికి సిద్ధంగా ఉన్నాడు.

దర్శకుడు ప్రభాస్ ను 4-5 రోజులు కావాలని కోరుకుంటున్నందున డేట్స్ ఇవ్వక తప్పలేదట. ఇప్పటివరకు సినిమాకు సంబంధించిన అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ లేదు. ఫ్యాన్స్ లో డౌట్స్ ఉన్నప్పటికీ ప్రభాస్ మారుతి పై చాలా నమ్మకంతో ఉన్నాడు. ఇక ఈ సినిమా చేయడానికి ప్రధాన కారణం వరుసగా యాక్షన్ సినిమాలు అవుతూ ఉండడంతో ఫ్యామిలీ ఆడియెన్స్ ను ఆకట్టుకోవడానికి కూల్ గా ఉండేలా ప్రభాస్ ఈ సినిమా చేస్తున్నాడు. ఇక ఈ షూట్ తర్వాత, ప్రాజెక్ట్ K యొక్క కొన్ని పెండింగ్ వర్క్‌లను ఫినిష్ చేయాలి అలాగే ప్రశాంత్ నీల్ సలార్ ప్రమోషనల్ సాంగ్ కోసం షూట్ చేయవచ్చు.

Post a Comment

Previous Post Next Post