జైలర్ డైరెక్టర్.. మరో స్టార్ దొరికినట్లే!


తమిళ యువ దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ తాజాగా విడుదలైన జైలర్‌తో భారీ బ్లాక్‌బస్టర్‌ను అందుకున్నాడు.  సూపర్ స్టార్ రజనీకాంత్ పవర్ తో ఈ సినిమా ఇప్పటికే రూ.400 కోట్ల గ్రాస్ అందుకుంది. ఈ వీకెండ్ లో లెక్క రూ.500 కోట్ల క్లబ్‌లో చేరేందుకు సిద్ధంగా ఉంది.  ఈ భారీ విజయాన్ని అందుకున్న అనంతరం నెల్సన్ తదుపరి దర్శకత్వ ప్రాజెక్ట్‌పై చాలా ఊహాగానాలు వస్తున్నాయి.

ఇక నెల్సన్ దిలీప్ కుమార్ ఇదివరకే ధనుష్ తో ఒక సినిమా చేయబోతున్నట్లుగా అనేక రకాల కథనాలు అయితే వచ్చాయి. ఇక కమల్ అయితే ప్రత్యేకంగా తనకి ఫోన్ చేసి మరి అభినందించి ఒక ఆఫర్ కూడా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అన్ని కుదిరితే నెక్స్ట్ కమల్ హాసన్ తోనే నెల్సన్ సినిమా చేసే అవకాశం ఉన్నట్లుగా కథనాలు వెలువడుతున్నాయి. ఇక విజయ్ తో కూడా నెల్సన్ మరో సినిమా చేయాల్సి ఉంది. బీస్ట్ టైమ్ లోనే మరో సినిమా చేద్దామని అగ్రిమెంట్ కూడా చేసుకున్నట్లు గతంలో ఒక టాక్ అయితే వచ్చింది. మరి ఈ దర్శకుడు నెక్స్ట్ సినిమాలో కమల్ తోనే చేస్తాడా లేదా అనేది మరికొన్ని రోజులతో తెలుస్తుంది. ఏదేమైనా నెక్స్ట్ ఈ దర్శకుడికి మాత్రం స్టార్స్ ఎవరైనా సరే గ్రీన్ సిగ్నల్ ఇస్తారని చెప్పవచ్చు.

Post a Comment

Previous Post Next Post