మెగాస్టార్ చిరంజీవి రాబోయే చిత్రం భోళా శంకర్ ఆగస్ట్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తమిళ్ వేదళం సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాకు మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన వహించగా ఈ చిత్రంలో తమన్నా భాటియా కథానాయికగా నటించింది. నిన్న రాత్రి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో అట్టహాసంగా జరిగింది.
అయితే ఈవెంట్ కు దాదాపు చిత్ర యూనిట్ సభ్యులలో అందరూ హాజరు కాగా తమన్నా భాటియా మాత్రం రాలేదు. ఆ విషయంలో రకరకాల కథనాలు వైరల్ అవుతున్నాయి. ఇక ఆమె ఎందుకు రాలేదంటే.. ముంబైలో జరిగిన మరో ఈవెంట్‌కు తమన్నా తప్పనిసరిగా హాజరు కావాల్సి వచ్చిందట. బాలీవుడ్ నటీమణులలో ఇష్టమైన మేకప్ ఆర్టిస్ట్ అయిన ఫ్లోరియన్ హురెల్ ముంబైలో మొట్టమొదటిసారిగా సెలూన్‌ని ప్రారంభించగా.. ఇక ఆ ఈవెంట్ కోసం తమన్నా వెళ్లాల్సి వచ్చిందట. అందుకే ఆమె రాలేదని చిత్ర యూనిట్ ద్వారా తెలుస్తోంది.
Follow
Post a Comment