మెగాస్టార్ చిరంజీవి వేదళం సినిమా రీమేక్ భోళా శంకర్ మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక చిత్ర యూనిట్ సభ్యులు ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేస్తున్నారు. ఈ సినిమా రీమేక్ అనే నెగెటివ్ కామెంట్స్ ని ఎక్కువగా అందుకుంటుంది. మరి ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుంది అనేది సినిమా విడుదలయితే కానీ అర్థం కాదు. అయితే ఈ సినిమాను పవన్ కళ్యాణ్ 2016 లోనే మొదలుపెట్టాలని అనుకున్నాడు.
అందుకు సంబంధించిన ఒక ఫోటో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నిర్మాత ఏఏం రత్నం తమిళ దర్శకుడు R. T. నీసన్ తో లాంచ్ చేసి ప్రాజెక్టు పూజా కార్యక్రమాలను కూడా అప్పుడు హైదరాబాదులోనే స్టార్ట్ చేశారు. కానీ ఆ తర్వాత పవన్ కళ్యాణ్ మళ్లీ వెనుకడుగు వేశాడు. దర్శకుడు R. T. నీసన్ తమిళంలో విజయ్ తో జిల్లా అనే సినిమా కూడా చేశాడు.
ఇక అతను పవన్ కళ్యాణ్ కోసం వేదళంను రీమేక్ చేయాలని గట్టిగానే ప్లాన్ చేసుకున్నప్పటికీ ఎందుకో అప్పుడు నిర్మాత ఆర్థిక కారణాల వల్లనే వెనుకడుగు వేసినట్లు ఒక టాక్ అయితే వినిపించింది. ఇక ఇన్నాళ్లకు మళ్ళీ మెగాస్టార్ చిరంజీవి మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరపైకి ఆ కథను తీసుకు వస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితం అందుకంటుందో చూడాలి.
Follow
Follow
Post a Comment